Hero Nikhil Private Video: తీగ లాగితే డొంకంతా కదిలింది
ABN , Publish Date - Feb 03 , 2025 | 08:33 PM
Hero Nikhil Private Video: టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కేసు కలకలం సృష్టిస్తుంది. గతేడాది వివాదాలకు కేరాఫ్‌గా నిలిచినా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే తీగ లాగితే డొంకంతా కదిలింది.
రాజ్ తరుణ్, లావణ్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొస్తున్నాయి. తాజాగా లావణ్య ఫిర్యాదు నార్సింగ్ పోలీసులు మస్తాన్ సాయి అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా ఆయన వద్ద 200-300పైగా ప్రైవేట్ వీడియోలను పోలీసులు గుర్తించారు. ఇందులో ప్రముఖ హీరోకు సంబంధించిన వీడియోలు కూడా ఉండటం కలకలం రేపుతోంది. మస్తాన్ సాయి తన ప్రైవేట్ వీడియోను చిత్రీకరించడం ద్వారానే రాజ్ తరుణ్ తనకు దూరమయ్యాడని ఆమె నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలోనే మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన పోలీసుల ఆయన వద్ద హార్డ్ డిస్క్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రముఖ నటుడు నిఖిల్ పార్టీ చేసుకుంటున్న ప్రైవేట్ వీడియోని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగా మస్తాన్ సాయి అనేకమంది అమ్మాయిలకు మాదక ద్రవ్యాలను అలవాటు చేసి వారి న్యూడ్ వీడియోలను డాక్యుమెంట్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం వారిని బ్లాక్ మెయిల్ చేసి లోంగబరుచుకున్నట్లు సమాచారం. అలాగే ప్రముఖ నటుల ఫోన్స్ ని హ్యాక్ చేయడంతో పాటు ఆడియో, వీడియో రికార్డింగ్స్ దాచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే లావణ్యపై అత్యాచారానికి కూడా పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఆ వీడియోని లావణ్య డిలీట్ చేసే క్రమంలో మస్తాన్ తనని చంపే ప్రయత్నం చేసినట్లు పోలీసులతో తెలిపింది.