Pushpa 2: 'పుష్ప రాజ్'కు దాసోహం అంటున్న హాలీవుడ్
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:55 AM
'పుష్ప నీ యవ్వ తగ్గేదే లే' అనే డైలాగ్ రేంజ్‌లోనే పుష్ప రాజ్ ప్రయాణం కొనసాగుతోంది. ఒకవైపు విదేశాల్లోనూ పుష్ప ఊచకోత మొదలుపెట్టి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు. మరోవైపు హాలీవుడ్ సినీ లోకం పుష్ప రాజ్‌కు గులాం అవుతూ.. మాస్ రివ్యూస్ ఇస్తోంది.
'పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్' అనే డైలాగ్‌ని సుకుమార్ ఏ ఉద్దేశంతో రాశాడో కాని అది అక్షరాల నిజమైంది. ఇప్పటి వరకు కేవలం నేషనల్ వైడ్‌గానే 'పుష్ప రాజ్' ర్యాంపేజ్ చూసిన సినీ లోకం, తాజాగా ఇంటర్నేషనల్ వైడ్‌గా పుష్ప విశ్వరూపాన్ని విట్‌నెస్ చేస్తోంది. 3 గంటల 40 నిమిషాల నిడివితో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సినిమాకి విదేశీయలు పట్టం కడుతున్నారు. సోషల్ మీడియాలో రివ్యూలు షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో అగ్రతాంబూలం
ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో 'పుష్ప 2' సినిమా ఇండియాతో పాటు మరో ఏడు దేశాల్లో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. వరల్డ్ వైడ్ గా 5.8 మిలియన్ల వ్యూస్‌తో అత్యధిక వ్యూస్ సంపాదించుకున్న రెండవ ఆంగ్లేతర సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. కాగా ట్రేడ్ పండితుల లెక్క ప్రకారం ఈ సినిమా వ్యూస్ మరింతా పెరిగే అవకాశమున్నట్లు తెలుపుతున్నారు.
మాస్ రివ్యూస్
ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను చూసి షాక్ అవుతున్న ఫారిన్ ఆడియెన్స్ ఈ సినిమా క్లిప్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎగ్జైట్‌మెంట్ ప్రదర్శిస్తున్నారు. అలాగే కొన్ని మాస్ రివ్యూస్‌ని కూడా పోస్ట్ చేశారు.
కొన్ని ఆధునిక హాలీవుడ్ సినిమాల కంటే మెరుగ్గా ఉంది.
మార్వెల్‌కు బడ్జెట్ ఉంది కానీ.. ఈ రేంజ్ సృజనాత్మకత లేదు.
ఒక సూపర్ హీరో సినిమాను 20 సార్లు రీమేక్ చేయడానికి బదులుగా హాలీవుడ్ ఈ సినిమా నుండి నోట్స్ తీసుకోవాలి.
ఇదొక మ్యాడ్‌నెస్, మంచి మార్గంలో
ఈ సినిమా రెసిపీని మార్వెల్‌కు చూపించండి.
సినిమాలంటే ఇలా ఉండాలి. రియాలిస్టిక్ సినిమాలు చూసి బోర్ కొడుతోంది. ఇది అన్‌బిలివ్‌బుల్