Puri Beggar: బెగ్గర్...పూరీకి కొత్త ఊపిరి పోస్తుందా

ABN , Publish Date - Apr 24 , 2025 | 05:18 PM

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నాడు. తన అప్ కమింగ్ మూవీ కోసం అదిరిపోయే స్కెచ్ వేశారు. కొడితే కుంభస్థలం బద్దలవ్వాలన్న రేంజ్ లో స్టోరీని లాక్ చేసుకున్నాడు.

'లైగర్'( Liger) , 'డబుల్ ఇస్మార్ట్' (Double iSmart ) మూవీలతో కెరీర్ లో డీలా పడిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కమ్ బ్యాక్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాడు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా రోజులుగా.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి అలసిపోయిన పూరీ.. చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ( Vijay Sethupathi) తో మూవీని ఓకే చేయించుకున్నాడు. తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవెల్ సినిమా చేసేందుకు ఓ బిగ్ స్కెచ్ వేస్తున్నాడు పూరి. తాజాగా ఈ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టి అప్పుడే కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.


విజయ్ సేతుపతి వంటి నటుడితో పూరి ఎలాంటి కథను అందిస్తారనే దానిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పూరి సొంత నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’(Puri Connects

) బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుందని, ఎప్పటిలాగే ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహరించనుంది. అయితే ఈ మూవీకి 'బెగ్గర్' అనే టైటిల్ ను లాక్ చేసినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి బిచ్చగాడిగా కనిపించనున్నాడట. అందుకే ఈ టైటిల్ ను పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో పాత పూరి బయటకు వచ్చేలా అదిరిపోయే స్ట్రిప్ట్ తో వచ్చేస్తున్నాడట. సేతుపతి కోసం బాలీవుడ్ నటి టబు (Tabu) తో పాటు రాధిక ఆప్టే (Radhika Apte) ను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే స్టోరీ లాక్ అవ్వడంతో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.

మామూలుగానే పూరీ సినిమా అంటే జెట్ స్పీడ్ గా సాగుతుంది. మూడు నాలుగు నెలల్లోనే సినిమాను కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు విజయ్ సేతుపతితో చేయనున్న సినిమాకు కూడా ఆ పార్ములానే అప్లై చేయనున్నాడు. జూన్‌లో సెట్స్‌ పైకి తీసుకెళ్లి కేవలం 60 రోజుల్లోనే సినిమాను ఫినిష్ చేయాలనుకుంటున్నాడట. ఇటు విజయ్ సేతుపతి సైతం సినిమాను ఫాస్ట్ గా పూర్తి చేయాలని సూచించాడట. దీంతో నాన్ స్టాప్ గా షూటింగ్ జరపనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక ఓ మురికివాడ సెట్ ను వేయాలనుకుంటున్నారట. ఈ సెట్ వర్క్ కంప్లీట్ అవ్వగానే... షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. మరి విజయ్ సేతుపతితో పూరి సినిమా కొత్త ఊపిరి పోస్తుందో లేదో అనేది చూడాలి.

Updated Date - Apr 24 , 2025 | 05:18 PM