Puri Jagannadh: పూరితో విజయ్‌ సేతుపతి.. ఎలాంటి కథంటే..

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:44 PM

'లైగర్‌', 'డబుల్‌ ఇస్మార్ట్‌' చిత్రాల పరాజయం తర్వాత డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తదుపరి చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఆయన అభిమానులు పూరి నుంచి ఆయన స్టైల్‌ సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.


 


'లైగర్‌', 'డబుల్‌ ఇస్మార్ట్‌' చిత్రాల పరాజయం తర్వాత డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తదుపరి చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఆయన అభిమానులు పూరి నుంచి ఆయన స్టైల్‌ సినిమా కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఫ్యాన్స్‌ కోరిక తీరే సమయం వచ్చింది. ఈ మధ్యన ఆయన తదుపరి చిత్రం గురించి వచ్చిన రూమర్స్‌  నిజమయ్యాయి.

తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay sethupathi) హీరోగా పూరి జగన్నాథ్‌ సినిమా తెరకెక్కించనున్నట్టు నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్‌ ప్రకటించింది. ఉగాది సందర్భంగా ఆదివారం ఈ వివరాలు వెల్లడించింది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రం జూన్‌లో ప్రారంభం కానుందని మేకర్స్‌ తెలిపారు. ఇతర అప్‌డేట్స్‌ త్వరలో ఇస్తామని పేర్కొన్నారు. 

Updated Date - Mar 30 , 2025 | 04:44 PM