NBK Party: బాలకృష్ణ లవ్‌ లెటర్‌ ఎవరికి రాశారు.. మాన్షన్‌హౌస్‌పై అంత ప్రేమేంటి

ABN , Publish Date - Feb 02 , 2025 | 03:14 PM

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలకృష్ణను ఆయన అక్కచెల్లెలు సరదాగా ఆటపట్టించారు. బాలయ్య పెళ్లి, హీరోయిన్లు తదితర విషయాలపై రాపిడ్‌ ఫైర్‌లాగా పురంధేశ్వరి, భువనేశ్వరి ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రశ్నలకు బాలయ్య సమాధానాలు ఇవ్వడానికి తడబడ్డారు.

Nandamuri Balakrishna

బాలకృష్ణ (NBK)లవ్‌ లెటర్‌ ఎవరికి రాశారు?

ఇష్టమైన హీరోయిన్స్‌ ఎవరు?

తొలిసారి వసుంధరను చూడగానే ఆయన ఫీలింగ్‌ ఏంటి?

మాన్షన్‌ హౌస్‌కి బాలయ్యకు మధ్య అంత అనుబంధం ఏంటి?

పద్మభూషన్‌ (Padmabhushan Balakrishna) ఎందుకు వచ్చింది?

-అక్క చెల్లెల ప్రశ్నలు.. బాలయ్య సమాధానాలు...

గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలకృష్ణను ఆయన అక్కచెల్లెలు సరదాగా ఆటపట్టించారు. బాలయ్య పెళ్లి, హీరోయిన్లు తదితర విషయాలపై రాపిడ్‌ ఫైర్‌లాగా పురంధేశ్వరి(Purandeswari), భువనేశ్వరి (Bhuvaneswari)ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రశ్నలకు బాలయ్య సమాధానాలు ఇవ్వడానికి తడబడ్డారు. కేంద్ర ప్రభుత్వం బాలయ్యకు పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఫామ్‌ హౌస్‌లో పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా సరదాగా సాగిన ఈ సంభాషణ మీకోసం...

పురందేశ్వరి: మొదట వసుంధరను ఎక్కడ చూసావు.. అందరి ముందు చెబితే వినాలని ఉంది.

బాలకృష్ణ: నాన్నగారు వైట్‌హౌస్‌ దగ్గర కొత్త ఇంటికి భూమి పూజ చేసిన రోజు తొలిసారి చూశాను. ఆ రోజు రిజ్‌లో ఉన్నానని చెప్పగా.. మధ్యలో పురందేశ్వరి అంటే ఎప్పుడు చూశావో గుర్తు లేదు అంటూ అంటూ ఆటపట్టించారు.




పురంధేశ్వరి: ఏ రిలేషన్‌షిప్‌లో అయిన మొహమాటానికి కొన్ని చేస్తుంటాం. నీకు ఇప్పుడు పద్మభూషణ్‌ అవార్డు వచ్చింది. అది ఎందుకు వచ్చింది? 40 ఏళ్లకుపైగా వసుంధరతో డిప్లామేటిక్‌గా నటించినందుకా? సినిమాల్లో నటించినందుకా క్లారిటీ కావాలి?


బాలయ్య: వసుంధర నా లక్కీ వైఫ్‌. ఆవిడ నన్ను భరించినందుకు. మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు. ఆప్‌ స్ర్కీన్‌, ఆన్‌ స్క్రీన్  నటించినందుకు అవార్డు వచ్చిందనుకుంటున్నా.

వసుంధరను చూసిన వెంటనే నీ రియాక్షన్‌ ఏంటి?
బాలయ్య: వెంటనే ఓకే చేశాను. సమయం కావాలని.. కొంచెం ఆలోచించుకొని చెబుతానని అనలేదు. వెంటనే ఓకే చేశాను
మధ్యలో పురందేశ్వరి అందుకుని చాలా రోజులు సమాధానం చెప్పలేదని నాన్నగారు (ఎన్టీఆర్‌) నన్ను పిలిచి అడిగారు. నువ్వు వెళ్లి బాలయ్యను కనుక్కో.. విషయం ఏంటని అన్నారు. నేను అప్పుడు నీతో కూర్చుని మాట్లాడాను.నాకు బాగా గుర్తుంది.


భువనేశ్వరి: బాల అన్నయ్య మీ మొదటి క్రష్‌ ఎవరు? హీరోయిన్స్‌లో నచ్చినవారు..
బాలయ్య: క్రష్‌ ఏమీ లేదు గానీ.. నాన్నగారు డైలాగ్‌.. అందాన్ని చూసి ఆనందించు కళా దృష్టి మాకు లేకపోలేదు. నాకు బాగా ఇష్టమైన హీరోయిన్లు విజయశాంతి, రమ్యకృష్ణ, సిమ్రాన్‌.

భువనేశ్వరి: మీకు మాన్షన్‌ హౌస్‌కి అంత అనుబంధం ఏంటి? ఎప్పుడు చంకలో పెట్టుకుని వెళ్తారు?
Balayya: మన ఇల్లు మాన్షన్‌లాగే.. మాన్షన్‌ హౌస్‌ నాకు మాన్షస్‌ అయిపోయింది. నన్ను అది బాగా ప్రేమించేసింది. అందుకే నాతోనే ఉంటుంది. ఇక వసుంధర, మాన్షన్‌ హౌస్‌ల గురించి చెప్పాలంటే.. చిత్ర పరిశ్రమకు రెండు కళ్లగా ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ ఎలాగైతే ఉన్నారో.. నాకు వసుంధర, మాన్షన్‌ హౌస్‌ రెండు కళ్లలాంటివి.

భువనేశ్వరి: మీరు ఎవరికైనా లవ్‌ లెటర్‌ రాశారా?
వసుంధరకి రాశాను. అప్పుడు ఏదో గిఫ్ట్‌ కూడా ఇచ్చింది.
వసుంధర: నేను గిఫ్ట్‌ ఏమీ ఇవ్వలేదు. ఆయనే డ్రెస్‌ తీసుకుని ఓ చిన్న లవ్‌లెటర్‌తో ఇచ్చారు. అది ఇప్పటికీ భద్రంగా దాచుకున్నా.

Updated Date - Feb 02 , 2025 | 03:30 PM