Ratan Rishi: ఆర్టిస్ట్ కు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ దన్ను
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:35 PM
సంతోష్ కల్వచెర్ల , క్రిషేక పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ 'ఆర్టిస్ట్'. ఈ సినిమాను నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ విడుదల చేస్తోంది.
సంతోష్ కల్వచెర్ల (Santhosh Kalwacherla), క్రిషేక పటేల్ (Krisheka Patel) జంటగా నటించిన సినిమా 'ఆర్టిస్ట్'. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీని జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించారు. దీనికి రతన్ రిషి దర్శకత్వం వహించారు. 'ఆర్టిస్ట్' మూవీ ఈ నెల 21న జనం ముందుకు వస్తోంది. దీనిని నైజాం ఏరియాలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేయబోతోంది.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, ''సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా ఆర్టిస్ట్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ''చూస్తూ చూస్తూ, ఓ ప్రేమా..'' సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లోనూ ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు. ఇందులో ఇతర కీలక పాత్రలను 'సత్యం' రాజేశ్ (Satyam Rajesh), ప్రభాకర్, వినయ్ వర్మ, తనికెళ్ల భరణి, భద్రమ్, తాగుబోతు రమేష్, సోనియా ఆకుల తదితరులు పోషించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించారు.
Also Read: Siddhu Jonnalagadda: జాక్ టీమ్ లోకి సామ్ సి.ఎస్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి