Prudhvi raj sukumar: సలార్‌ గురించి పృథ్వీరాజ్‌ మరోసారి కామెంట్‌..

ABN , Publish Date - Feb 18 , 2025 | 11:15 AM

2023 ప్రేక్షకుల ముందుకొచ్చిన సలార్ కలెక్షన్ల సునామీ సృష్టించింది. గత ఏడాది ఫిబ్రవరి 16న ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ అప్పటినుంచి ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది.


ఈ మధ్యకాలంలో తరచూ హీరో ప్రభాస్‌,
సలార్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. ప్రభాస్‌తో ఆయన సలార్‌ చిత్రంలో నటించారు. 2023 ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. గత ఏడాది ఫిబ్రవరి 16న ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ అప్పటినుంచి ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. ఓటీటీలో టాప్‌ 10లో స్థానంలో ఉంది. దీనిపై పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ స్పందించారు.

‘‘365 రోజుల నుంచి ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంది. అద్భుతమైన థియేటర్‌ రన్‌ తర్వాత మా చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా రికార్డ్‌ తిరగరాసింది. ఇది నేనెప్పుడూ ఊహించలేదు. ఇది కేవలం రికార్డు కాదు.. మా ప్రేక్షకుల ప్రేమ, వారి అభిమానానికి నిదర్శనం. ఈ ప్రయాణం నిజంగా మరపురానిదిగా చేసినందుకు అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అని అన్నారు. మొదట నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ‘సలార్‌’ స్ట్రీమింగ్ అయింది. ఆ తర్వాత జియో హాట్‌స్టార్ వేదికగా హిందీ వెర్షన్‌ స్ర్టీమింగ్‌లోకి వచ్చింది. ఇది గతేడాది నుంచి ఇప్పటివరకూ టాప్‌ 10లో ట్రెండింగ్‌ అవుతోంది. దీంతో ప్రభాస్‌, పృథ్వీ, ప్రశాంత్‌ నీల్‌ ఫ్యాన్స్‌ ఆనందిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా విష్‌ చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ను ఉత్తరాదిన టీవీలో ప్రదర్శించగా అది మిలియన్లకొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఏకంగా 30 మిలియన్ల వ్యూస్‌ను సాధించి రికార్డు నెలకొల్పింది. 2024లో అత్యధిక వ్యూస్‌ పొందిన టాప్‌ 3 చిత్రాల జాబితాలో ‘సలార్‌’ నిలిచింది. ‘సలార్‌: పార్ట్‌-1 సీజ్‌ ఫైర్‌’ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో రెండో పార్ట్‌ ‘శౌర్యాంగపర్వం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రశాంత్‌ నీల్‌ స్క్రిప్ట్ పై మరింత దృష్టిపెట్టారు.

ALSO READ: Karan Johar: రాజమౌళి, సందీప్ వంగాపై కరణ్‌ జోహార్ సంచలన వ్యాఖ్యలు


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Feb 18 , 2025 | 11:25 AM