Sreeleela: శ్రీలీలతో పెద్ద ఇబ్బందే వచ్చి పడింది.. ప్రమాదం సుమా..
ABN , Publish Date - Jan 31 , 2025 | 05:30 PM
శ్రీలీలజోరు చూసి టాలీవుడ్‌కు మరో శ్రీదేవి అవుతుందనుకున్నారంతా. కానీ శ్రీలీలకు దిష్టి తగిలిందో ఏమో గానీ వరుస పరాజయాలు చవిచూసింది. అవకాశాలు తగ్గాయి.
కథల ఎంపిక, వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్న శ్రీలీలను (Sreeleela) చూసి అంతా ఆశ్చర్యపోయారు. బులెట్‌లా దూసుకుపోతుందని నివ్వెర పోయారు. నాలుగు సినిమాలు సెట్స్‌పై ఉంటే అందులో రెండు సినిమాల్లో శ్రీలీలనే కథానాయిక అన్నట్లు గత ఏడాది గడిచింది. ఆమె జోరు చూసి టాలీవుడ్‌కు మరో శ్రీదేవి అవుతుందనుకున్నారంతా. కానీ శ్రీలీలకు (Heroine Sreeleela) దిష్టి తగిలిందో ఏమో గానీ వరుస పరాజయాలు చవిచూసింది. అవకాశాలు తగ్గాయి. అయితే 'పుష్ప-2'లో కిస్సిక్ (kissik Sreeleela) అంటూ చేసిన సందడితో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. (Date Issue with Sreeleela)
ఇప్పుడు మళీ స్పీడు పెంచి సినిమాలు ఒప్పుకుంటోంది. అలాగే పారితోషికం కూడా పెంచుకుంటూ వెళ్తుందని టాక్ నడుస్తోంది. కానీ శ్రీలీల ఇక్కడ ఓ తప్పు చేస్తుందని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అదేంటంటే.. కాల్షీట్లు అందుబాటులో ఉన్నాయో, లేదో చూడకుండా అడ్వాన్సులు తీసుకుంటోందట. దాంతో డేట్ల విషయంలో క్లాష్ వస్తోంది. శ్రీలీల కోసం సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆమె చేతిలో ఉన్న అవకాశాలు జారిపోయే ప్రమాదం ఉంది.
రవితేజ ‘మాస్ జాతర’లో (Mass Jathara) శ్రీలీల కథానాయిక. అయితే ఇప్పుడు శ్రీలీల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది. ఇప్పటి వరకూ 12 రోజులపాటు కాల్షీట్లు ఇచ్చింది. మరో 20 రోజుల పాటు తన డేట్లు కావాలి. కానీ ఆమె ఓ తమిళ సినిమాకు వరుస డేట్లు ఇచ్చింది. రవితేజ సినిమాకు ఏప్రిల్ లో ఇస్తానంటోందని ఈ చిత్రం బృందం నుంచి టాక్ బయటకు వచ్చింది. దాంతో శ్రీ లీలను పక్కనపెట్టి మరో కథానాయికని తీసుకుందామనే ఆలోచన చేస్తోందట చిత్రబృందం. అయితే ఇప్పటికే కొంత షూట్ జరిగింది. కథానాయికని పక్కన పెడితే, అవన్నీ మళ్లీ రీషూట్లు చేయాలి. అఖిల్ సినిమాలోనూ కథానాయికగా శ్రీలీలను ఎంచుకొన్నారు. అక్కడా కాల్షీట్ల ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలున్నాయి. దాంతో వాళ్లు కూడా మరో ఆప్షన్ వెదుకుతున్నట్టు సమాచారం. వచ్చిన ప్రతీ అవకాశాన్నీ కావాలనుకోవడం, రెమ్యూనరేషన్ కోసం వరుసగా సినిమాలకు సైన్ చేయడం వల్లనే ఈ సమస్య. ఇలాగైతే నిర్మాతలు ఇబ్బంది పడతారు. ఈ విషయాన్ని శ్రీలీల గమనిస్తే కెరీర్‌కు బావుంటుందని సన్నిహితులు సలహా ఇస్తున్నారట.