SKN Viral Comments: తెలుగు హీరోయిన్లపై నిర్మాత వ్యాఖ్యలు వైరల్
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:10 AM
తెలుగు కథానాయికలపై నిర్మాత ఎస్‌కెఎన్ (Producer SKN) వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనిపై కొందరు విమర్శలు కూడా చేశారు.
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)నటించిన లవ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘డ్రాగన్’ (Dragon). అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు అతిథి హాజరైన నిర్మాత ఎస్‌కెఎన్ (Producer SKN) వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనిపై కొందరు విమర్శలు కూడా చేశారు.
‘‘మేము తెలుగు రాని హీరోయిన్‌లను అభిమానిస్తాం. ఎందుకంటే.. తెలుగు వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమౌతుందో ఈ మధ్యనే అర్థమైంది. ఇకనుంచి తెలుగు (Tollywood Heroins) అమ్మాయిలను ప్రోత్సహించకూడదని నేను, దర్శకుడు సాయిరాజేశ్ నిర్ణయించుకున్నాం’’ అని అన్నారు. (SKN Comments telugu Heroines)
అయితే ఎస్‌కెఎన్ చేసిన కామెంట్స్ తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించేనని టాక్ నడుస్తోంది. బేబీ సినిమాతో తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్యను హీరోయిన్‌గా పరిచయం చేశారు ఎస్‌కెఎన్. హీరోయిన్‌గా తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకుని ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ప్రస్తుతం అమె సిద్దు జొన్నలగడ్డ, ఆనంద్ దేవరకొండతోలతో సినిమాలు చేస్తోంది. వైష్ణవి చైతన్యకి క్రేజ్ పెరిగిన తర్వాత ఎస్‌కేఎన్ బ్యానర్‌లో ఓ సినిమా ఆఫర్ చేస్తే ఆమె అంగీకరించలేదట. అందుకే ఎస్‌కేఎన్ ఈ వ్యాఖ్యలు చేశారని వినిపిస్తున్నాయి. అయితే కొందరు ఎస్‌కేఎన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తెలుగు నాయికలు ఒక్కో మెట్టు ఎక్కుతున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.