SSMB29: సూపర్‌స్టార్ కోసం గ్లోబల్‌స్టార్.. అధికారికమేనా..
ABN , Publish Date - Jan 17 , 2025 | 10:22 AM
గ్లోబల్‌స్టార్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా SSMB29లో నటించనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్‌కు వచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మహేశ్‌బాబు(Mahesh Babu), రాజమౌళి (Raja Mouli) కాంబినేషన్‌లో రాబోతున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుందా అని ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని సైలెంట్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచే రకరకాల ఉహాగానాలు వైరల్ అయ్యాయి. ఏదీ అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఇప్పుడు మరో వార్త నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గ్లోబల్‌స్టార్, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఈ సినిమాలో నటించనున్నట్లు ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. దీంతో మహేశ్- రాజమౌళి ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్‌కు వచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె విమానాశ్రయంలో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌పై త్వరలోనే అధికారిక అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. (Priyanka Chopra For SSMB 29)
ఇటీవల ఈ చిత్రం హైదరాబాద్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. కథా నేపథ్యం మినహా దీనికి సంబంధించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారాన్ని బయట పెట్టలేదు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో విదేశీ నటులు కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.