Priyanka Chopra: మహేష్‌తో సినిమా.. ఇక అంతా ప్రియాంకా చేతిలోనే
ABN , Publish Date - Jan 23 , 2025 | 09:47 PM
యేడాది మొత్తం ఒకే సినిమాకు ఇవ్వడం ప్రియాంకా లాంటి స్టార్‌కు కష్టమైన పనే. పైగా ప్రియాంక ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా అంటూ తిరుగుతోంది.
మహేష్ బాబు (Mahesh Babu) – రాజమౌళి (SS Rajamouuli) కాంబోలో రూపుదిద్దుకొంటున్న చిత్రంలో కథానాయికగా గ్లోబల్‌స్టార్ ప్రియాంకా చోప్రాను (Priyanka Chopra) సెలెక్ట్ చేసినట్లు కొద్దిరోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ప్రియాంకా హైదరాబాద్‌లో దిగిపోయింది. మరో రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో దర్శనమిచ్చింది. రాజమౌళి అండ్ టీమ్ కు ప్రియాంకా లుక్ టెస్ట్ కూడా ఇచ్చిందని సమాచారం. ఇవన్నీ చూస్తుంటే ప్రియాంకా కథానాయికగా ఎంపికవ్వడం దాదాపుగా ఖాయమే అనిపిస్తుంది.
అయితే ఇప్పుడు ఈ నిర్ణయం ప్రియాంక చేతుల్లోనే ఉందట. ఎందుకంటే రాజమౌళి ప్రియాంకను బల్క్ డేట్లు అడుగుతున్నారని టాక్ వినిపిస్తోంది. యేడాది మొత్తం ఒకే సినిమాకు ఇవ్వడం ప్రియాంకా లాంటి స్టార్‌కు కష్టమైన పనే. పైగా ప్రియాంక ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలతో బిజీగా అంటూ తిరుగుతోంది. హాలీవుడ్ అవకాశాలపై గట్టిగా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమాకు బల్క్ డేట్లు ఇవ్వగలదా అన్నదే సమస్య. రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు హాలీవుడ్ రేంజే. మహేష్ చిత్రాన్ని అంతర్జాతీయ స్థ్థాయిలో తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు రాజమౌళి (SSMB 29).
అలాంటప్పుడు ప్రియాంక పెద్దగా ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. కాకపోతే.. ఆ డేట్లు ముందే ఎవరికైనా ఇచ్చి ఉంటే మాత్రం కాస్త ఇబ్బందే. ప్రియాంక ఒక్కరినే కాదు. ఈ సినిమాలో నటించే నటీనటులందరి డేట్లు రాజమౌళి బల్క్ గానే అడుగుతున్నారట. కాకపోతే ఇక్కడ ఒకటే చిక్కు. మహేష్ సినిమాకు సంబంధించిన షెడ్యూల్స్ ఇంకా ఖరారు కాలేదు. అవి ఓకే అయితే.. డేట్ల విషయంలో ఓ క్లారిటీ వస్తుంది. మరోవైపు రాజమౌళి ప్రీ ప్రొడక్షన్‌ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. మరోవైపు లొకేషన్ రెక్కీ నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరున కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్ తీర్చిదిద్దారు. అక్కడే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.