Highest Paid Villain: హయ్యెస్ట్ పెయిడ్ విలన్‌గా స్టార్ హీరోయిన్.. కమల్, సేతుపతిలను మించి
ABN , Publish Date - Feb 09 , 2025 | 09:35 PM
ప్రస్తుతం ఆ హీరోయిన్ కెరీర్‌కు పెద్ద డోకా ఎం లేదు. స్టార్ హీరోలతో సినిమాలలో నటిస్తూ మరోవైపు ఓటీటీలలోను యాక్షన్ వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. ఆ స్టార్ హీరోయిన్ విలన్‌గా మారిందంటే.. ఎవరో వయస్సు మీదపడినా నటి అనుకుంటే పెద్ద పొరపాటే. ఆమె ఎవరో విదేశీ నటి కాదు.
ప్రస్తుతం హీరోలతో పాటు విలన్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా పాన్ ఇండియా కాన్సెప్ట్ ఊపందుకున్న తర్వాత స్టార్స్ యాక్టర్స్ విలన్లుగా నటించడంతో వారికి విపరీతమైన క్రేజ్ ఏర్పడటంతో పాటు భారీ రెమ్యునరేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. కల్కి, జవాన్. యానిమల్ సినిమాల్లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, బాబీ డియోల్ వంటి స్టార్ యాక్టర్స్ నటించి భారీ రెమ్యునరేషన్ కొల్లగొట్టారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ కాదు స్టార్ హీరోయిన్ ఇప్పుడు విలన్ గా నటించి అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ కొల్లగొట్టి సరికొత్త రికార్డ్ సృష్టించనుంది.
ప్రస్తుతం ఆ హీరోయిన్ కెరీర్‌కు పెద్ద డోకా ఎం లేదు. స్టార్ హీరోలతో సినిమాలలో నటిస్తూ మరోవైపు ఓటీటీలలోను యాక్షన్ వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. ఆ స్టార్ హీరోయిన్ విలన్‌గా మారిందంటే.. ఎవరో వయస్సు మీదపడినా నటి అనుకుంటే పెద్ద పొరపాటే. ఆమె ఎవరో విదేశీ నటి కాదు. ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది కూడా విదేశీ సినిమాకు కాదు. తెలుగు సినిమాకే. ఎవరని షాక్ అవుతున్నారా? ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు. ప్రియాంక చోప్రా. దర్శకుడు రాజమౌళి.. మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న 'SSMB 29' సినిమాలో ఆమె విలన్ గా నటిస్తుందట. దీనికోసం ఆమె అక్షరాల రూ. 30 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనుందట. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాలో ఒక విలన్ కు ఇంతా పారితోషకం ఇవ్వలేదు. అంత ఎందుకు ఇప్పటి వరకు ఇంత రెమ్యునరేషన్ ని చాలా మంది స్టార్ హీరోలు కూడా అందుకోకపోవడం గమనార్హం.
హయ్యెస్ట్ పెయిడ్ విలన్లు వీరే
కమల్ హాసన్: 'కల్కి' సినిమాతో విలన్ గా మారిన కమల్ ఈ సినిమా కోసం రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు.
విజయ్ సేతుపతి: షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాలో విలన్ గా నటించిన విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమా కోసం రూ. 21 కోట్లు అందుకున్నాడు.
సైఫ్ అలీ ఖాన్: ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో రావణుడిగా కనిపించడానికి సైఫ్ రూ. 10 కోట్లు ఛార్జ్ చేశాడు.
ఇమ్రాన్ హష్మీ: బాలీవుడ్ బ్యాడ్ ఇమ్రాన్ హష్మీ 'టైగర్' ఫ్రాంచైజీలో విలన్‌గా చేసేందుకు రూ. 10 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు.
సంజయ్ దత్: బాలీవుడ్ సీనియర్ యాక్టర్ ప్రస్తుతం సౌత్ సినిమాలో విలన్‌గా మారిన సంజయ్ దత్ 'కేజీఎఫ్ 2', 'లియో' సినిమాలకు రూ.9-8 కోట్లు ఛార్జ్ చేశాడు.
బాబీ డియోల్: యానిమల్ సినిమాతో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బాబీ డియోల్ లైఫ్ మరోసారి మారిపోయింది. తర్వాత ఒక్కో సినిమాకు బాబీ రూ. 5 నుంచి రూ. 6 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడు.