Priyadarshi: టాలీవుడ్ 'నవాజుద్దీన్ సిద్దిఖీ'.. ప్రియదర్శి

ABN , Publish Date - Jan 19 , 2025 | 09:02 PM

Priyadarshi: డిఫరెంట్ జానర్స్ లో విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటున్న దర్శిని గతంలో ఓ సినీ విమర్శకుడు తెలంగాణ నవాజుద్దీన్ సిద్దిఖీగా అభివర్ణించడంలో ఎలాంటి సంశయం లేదని చెప్పొచ్చు.

Priyadarshi

ప్రియదర్శి.. గత దశాబ్దంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయటపడిన అరుదైన మాణిక్యం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పెద్ద స్టార్స్ ఉన్నా.. గొప్ప నటుల విషయంలో కొంచెం వెలతి ఏర్పడిన సంగతిని కాదనలేము. ఈ వెలతిని పూడ్చడానికి అన్నట్లు కొందరు విలక్షణమైన సెన్సిబుల్ నటులు ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఈ దశాబ్ద కాలంలో ఆ క్రెడిట్ దక్కాల్సిన నటులలో ఒకరు ప్రియదర్శి. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇక నుంచి హీరోల స్నేహితుడి క్యారెక్టర్ కి 'నో' చెప్తానని చక్కటి వివరణ ఇచ్చారు.


'పెళ్లి చూపులు' సినిమాలో 'నా సావ్ నేను సస్తా' అంటూ గోల చేస్తూ ఇండస్ట్రీలోకి వచ్చిన కామ్ పర్సనాలిటీ తో మంచి దర్శక నిర్మాతల కళ్ళల్లో పడ్డాడు. ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్ తో పాటు ఎమోషనల్ చేసే పాత్రల్లోనూ అలవోకగా నటిస్తాడు దర్శి. తాజాగా ఇప్పుడు మరో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రామ్ జగదీష్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నిర్మిస్తున్న చిత్రం 'కోర్టు: స్టేట్ వర్సెస్ నోబడీ'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాని మార్చి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీపై ప్రత్యేకంగా విమర్శకులలో భారీ అంచనాలు ఉన్నాయి.


మరోవైపు నేడు(ఆదివారం) 'ప్రేమంటే థ్రిల్లు ప్రాప్తిరస్తు' అనే ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. ఈ మూవీని ఏషియన్ సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ నిర్మిస్తున్నారు. దర్శి, ఆనంది హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో యాంకర్ సుమ కనకాల కీలక పాత్రలో నటించనుంది. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా డెబ్యూ చేయనున్నాడు. రానా దగ్గుబాటి సహా నిర్మాతగా వ్యహరించనున్నారు. డిఫరెంట్ జానర్స్ లో విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటున్న దర్శిని గతంలో ఓ సినీ విమర్శకుడు తెలంగాణ నవాజుద్దీన్ సిద్దిఖీగా అభివర్ణించడంలో ఎలాంటి సంశయం లేదని చెప్పొచ్చు.


Also Read-Chiranjeevi - Venkatesh: చిరంజీవి తర్వాత వెంకటేష్..

Also Read- Star Heroine: ఈ క్యూట్ గర్ల్.. ఇప్పుడు గ్లామర్ క్వీన్

మా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 19 , 2025 | 09:06 PM