Prithviraj Sukumaran: ప్రభాస్ అసలు సీక్రెట్ చెప్పేసాడు
ABN , Publish Date - Feb 04 , 2025 | 02:09 PM
"ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినా దానికి గురించి అసలు ఆలోచించరు. సోషల్ మీడియా, గొప్పలపై ఆసక్తి ఉండదు. ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్‌స్టా నుంచి వచ్చే పోస్ట్‌లు పెట్టేది కూడా ఆయన కాదు. ఈ మాట చెప్పి మీ అందరినీ నిరాశ పరిచినందుకు క్షమించండి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటారు. అరుదుగా ఆయన సోషల్ మీడియాలో కనిపిస్తారు. సాహో (Saaho) సినిమా టైమ్‌లో ఆయన సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. అక్కడ నుంచి ఆయనకు మిలియన్ల మంది ఫాలోయర్లు. వ్యక్తిగత విషయాలను షేర్ చేయరు కానీ.. సినిమాలకు సంబంధించి అప్‌డేట్లూ ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం 13 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇన్‌స్టా అకౌంట్‌పై నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran) సుకుమారన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
"ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినా దానికి గురించి అసలు ఆలోచించరు(Out of stardom) . సోషల్ మీడియా, గొప్పలపై ఆసక్తి ఉండదు. ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్‌స్టా నుంచి వచ్చే పోస్ట్‌లు పెట్టేది కూడా ఆయన కాదు. ఈ మాట చెప్పి మీ అందరినీ నిరాశ పరిచినందుకు క్షమించండి. అతనికి చిన్న చిన్న ఆనందాలంటే ఇష్టం. ఫామ్‌హౌస్‌లో సంతోషంగా ఉంటాడు. ఎక్కడైనా మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్దాం అని ఎప్పుడూ అడుగుతుంటాడు. స్నేహితులతో సరదాగా గడపడం.. ఇవే ఆయన కోరుకునేవి. అలాంటి వ్యక్తి ఇలాంటి చిన్న ఆనందాలను కోరుకోవడం చూసి ఆశ్చర్యపోతాను’’ అని అన్నారు.
తదుపరి ఆయన రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘బాహుబలి’ తర్వాతే హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయడం ప్రారంభించారు. ఆ సినిమాకు ముందు కొన్ని సినిమాల సీక్వెల్స్ వచ్చినప్పటికీ ‘బాహుబలి 2’ రికార్డు స్థాయిలో విజయం సాధించడంతో సీక్వెల్స్‌లో జనాల్లో ఆసక్తి ఎక్కువైంది. ఇటీవల వచ్చిన ‘పుష్ప 2’ కూడా సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అలాగే త్వరలోనే ‘సలార్2’ కూడా రానుంది’’ అని అన్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్2: ఎంపురాన్’తో బిజీగా ఉన్నారు. మోహన్‌లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం అలరించింది. ఇప్పుడు ఈ సినిమాకు ‘లూసిఫర్ 2: ఎంపురాన్ పేరుతో ప్రీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.