Prithviraj Sukumaran: రాజమౌళి సినిమాపై క్లారిటీ ఇచ్చిన పృథ్వీరాజ్‌

ABN , Publish Date - Jan 29 , 2025 | 06:23 PM

Prithviraj Sukumaran: రాజమౌళి సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటిస్తున్నాడా? ఏ పాత్రలో నటిస్తున్నాడు? తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి కదా! ఇలాంటి ప్రశ్నలన్నింటికీ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నేరుగా సమాధానమిచ్చాడు.

Prithviraj Sukumaran Opens Up on Rajamoulis Film

యావత్ సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ 'SSMB 29'. ఈ సినిమాలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా హాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కీలక పాత్రలో నటించనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా నుండి పృథ్వీరాజ్‌ తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి. అలాగే పృథ్వీరాజ్‌ రోల్ ని బాలీవుడ్ బ్యాడ్ బాయ్ జాన్ అబ్రహాం భర్తీ చేయనున్నట్లు ప్రచారం సాగింది. ఆ వార్తల్లో నిజమెంత ఉందొ తెలీదు కానీ.. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి ఇంతకీ పృథ్వీ ఏమన్నారంటే..


రాజమౌళి సినిమాలో మీరు విలన్ గా నటిస్తున్నారట కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘నాకంటే మీకే చాలా విషయాలు తెలిశాయి. ఇంకా ఏదీ స్పష్టత రాలేదు. చర్చలు జరుగుతున్నాయి. అవి ఫైనల్‌ అయ్యాక దీని గురించి మాట్లాడుకుందాం’’ అన్నారు. ఇక 'సలార్ 2' గురించి అడగగా ‘‘సలార్‌ 2’ తప్పకుండా చేస్తాం. ఎన్టీఆర్‌తో ప్రశాంత్‌ నీల్‌ ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక ‘సలార్‌ 2’ స్టార్ట్ అవుతుంది’’ అంటూ సమాధానమిచ్చారు. ప్రభాస్ గురించి అడగగా ‘‘ప్రభాస్‌కు ఉన్న స్టార్‌డమ్‌ ఆయనకు తెలీదు. నాకు తెలిసినంత వరకూ ఆయన సోషల్‌మీడియా కూడా ఉపయోగించరు. ప్రైవేట్‌ పర్సన్‌. అత్యంత సన్నిహితులతోనే అన్ని విషయాలు పంచుకుంటారు’’ అని తెలిపారు.

Game Changer: ఓటీటీలోకి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఎప్పుడు, ఎక్కడంటే?


ఇదిలా ఉండగా రాజమౌళి 'SSMB 29' కోసం నటీనటులు, సాంకేతిక నిపుణులతో చిత్రబృందం నాన్‌-డిస్‌క్లోజ్‌ అగ్రిమెంట్‌ (NDA) చేయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఎలాంటి లీకులు కాకుండా చిత్ర బృందం భారీగా ప్లాన్ చేసింది. ఈ సినిమాని దుర్గ బ్యానర్ పై KL నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా అడవుల్లో సాగే సాహస ప్రపంచ యాత్ర నేపధ్యంలో సాగనున్నట్లు టాక్.

Also Read- Chinmayi Sripada: ఇన్స్టా చుక్కలకు ఇచ్చి పడేసిన చిన్మయి..

Also Read- Balakrishna: 'హిట్ 4'లో హీరోగా బాలయ్య?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 29 , 2025 | 06:27 PM