Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ పోస్ట్‌తో క్లారిటీ.. మరోసారి ట్రెండింగ్‌లో...
ABN , Publish Date - Mar 04 , 2025 | 02:42 PM
ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB29) సినిమా అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అధికారికంగా ఇప్పటి దాకా ఏ అప్‌డేట్ రాలేదు.. కానీ అనధికారికంగా వచ్చిన ప్రతి వార్త విపరీతంగా వైరల్ అవుతోంది.
మహేశ్‌బాబు (MaheshBabu)ప్రధాన పాత్రలో దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB29) వర్కింగ్ టైటిల్‌తో కె.ఎల్ నారాయణ (KL Narayana) నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. అధికారికంగా ఇప్పటి దాకా ఏ అప్‌డేట్ రాలేదు.. కానీ అనధికారికంగా వచ్చిన ప్రతి వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. పృథ్వీరాజ్ సుకుమారన్ పెట్టిన పోస్ట్‌తో నెటిజన్‌లు ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) నటించనున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ హీరో తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఎస్‌ఎస్‌ఎంబీ29ను ఉద్దేశించే దాన్ని పెట్టారని నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు.
‘‘దర్శకుడిగా నా చేతిలోని సినిమాలన్నీ పూర్తి చేశాను. వాటికి సంబంధించిన మార్కెటింగ్ పనులు కూడా ఓ కొలిక్కి వచ్చాయి. నటుడిగా తెరపై కనిపించడానికి సిద్థమవుతున్నా. పరభాష చిత్రంలో కనిపించనున్నా. అందులో పెద్ద డైలాగులు ఉన్నాయని తెలిసి కాస్త భయపడుతున్నా’’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో పృథ్వీ రాజమౌళి, మహేశ్ ప్రాజెక్ట్ కోసం తన ప్రాజెక్ట్‌లన్నీ పూర్తి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ తాను మహేశ్ - రాజమౌళి ప్రాజెక్ట్‌లో ఉన్నట్లు వస్తోన్న రూమర్స్‌పై స్పందించారు. ‘‘నాకంటే మీడియా, సోషల్ మీడియాకే చాలా విషయాలు తెలిశాయి. ఇంకా ఏదీ స్పష్టత రాలేదు. చర్చలు జరుగుతున్నాయి. అవి ఫైనల్ అయ్యాక దీని గురించి మాట్లాడుకుందాం’’ అని ఆయన అన్నారు. ఇప్పుడు పృథ్వీరాజ్ పోస్ట్ వైరల్ అవుతోంది. అటవీ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు.