Premante: థ్రిల్ యూ ప్రాప్తిరస్తు అంటున్న ప్రియదర్శి...

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:15 PM

ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ప్రేమంటే'. ఆనంది, సుమ కనకాల ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షెడ్యూల్ ఇటీవల పూర్తయ్యింది.

'మల్లేశం' (Mallesam) సినిమాతో హీరోగా మారాడు కమెడియన్ ప్రియదర్శి. ఆ తర్వాత వచ్చిన 'బలగం (Balagam), 35, కోర్ట్ (Court)' సినిమాలు చక్కని ఆదరణ పొందాయి. ఇక శుక్రవారమే అతని లేటెస్ట్ మూవీ 'సారంగపాణి జాతకం' (Sarangapaani Jathakam) విడుదలైంది. ఎంటర్ టైన్ మెంట్ కు పెద్ద పీట వేసిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఎక్సయిటింగ్ లైనప్ తో అలరిస్తున్న ప్రియదర్శి తాజా చిత్రం 'ప్రేమంటే' (Premante). ఈ సినిమాను రానా దగ్గుబాటి (Rana Daggubati), జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు క్రేజీ కొలాబరేషన్ లో చేస్తున్నారు. 'థ్రిల్ - యూ ప్రాప్తిరస్తు' అనేది ట్యాగ్‌లైన్‌. ట్యాలెంట్ యాక్టర్ ఆనంది (Anandi), ప్రముఖ యాంకర్ సుమ కనకాల (Suma Kanakala) ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ ఉమెన్ 2024 అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన తర్వాత జాన్వి నారంగ్ ఫస్ట్ ప్రొడక్షన్ వెంచర్ ఇది.


'ప్రేమంటే' సినిమా తాజా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్రధాన తారాగణం పాల్గొన్న ఈ షెడ్యూల్ చాలా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో, ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ల పై నిర్మిస్తున్నారు, స్పిరిట్ మీడియా దీనిని సమర్పిస్తోంది. ఈ చిత్రం ఎక్సయిటింగ్ సినిమా ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు, అన్వర్ అలీ ఎడిటర్.

Also Read: Naga Chaitanya: తారక్‌ నోట.. చైతూ రెస్టరెంట్‌ స్పెషల్స్‌

Also Read: Sarangapaani Jathakam: సారంగపాణి జాతకం రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 25 , 2025 | 04:16 PM