Chiranjeevi: ప్రజారాజ్యం జనసేనగా మారింది..
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:00 AM
ప్రజారాజ్యం.. జనసేనగా రూపాంతరం చెందింది అందుకు ఆనందంగా ఉంది. అప్పుడు కరాటే రాజుకి అవకాశం ఇచ్చా. కానీ, పరిస్థితులు మారాయి’
"విశ్వక్ తండ్రి కరాటే రాజు ‘ప్రజారాజ్యం’ (Prajarajyam) సమయంలో రాజకీయంగా కీలకంగా ఉండేవారు. ఆయన ఎప్పటి నుంచో నాకు తెలుసు అంటూ చిరంజీవి Chiranjeevi) ప్రజారాజ్యం పేరు ప్రస్తావించగానే అభిమానులు విపరీతంగా కేరింతలు కొట్టారు. ఆపై ఆయన మాట్లాడుతూ ప్రజారాజ్యం.. జనసేనగా (Janasena) రూపాంతరం చెందింది అందుకు ఆనందంగా ఉంది. అప్పుడు కరాటే రాజుకి అవకాశం ఇచ్చా. కానీ, పరిస్థితులు మారాయి’’ అని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు చిరు. విశ్వక్‌సేన్ హీరోగా నటించిన చిత్రం ‘లైలా’. ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ట్రైలర్ చూశాక ఎక్కడో దాగున్న కోరికలు పైకొచ్చాయి. లేడీ గెటప్పులో విశ్వక్ బాగున్నాడు. నిజంగా విశ్వక్ అమ్మాయి అయి ఉంటే గుండె జారి గల్లంతు అయ్యేదేమో. లేడీ గెటప్పులో నేను ఓ సినిమా చేశా, రాజేంద్ర ప్రసాద్ ఓ సినిమాలో చేశాడు. అవన్నీ బాగా ఆడాయి. ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుంది. విశ్వక్‌సేన్ ఇండస్ట్రీలో జెండా పాతాలి.’’ అని చిరంజీవి అన్నారు.