Kannappa: రెబల్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి..
ABN , Publish Date - Jan 27 , 2025 | 03:46 PM
Kannappa: టీజర్ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఎందుకంటే అందరి పాత్రలు ఎంతో కొంత కనిపించిన ప్రభాస్ నామాల దర్శనంతోనే ఫ్యాన్స్ కి సరిపెట్టేశాడు విష్ణు. విష్ణుకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే దీంతో ప్రభాస్ ని చూడటానికి అందరిలో స్పెషల్ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే..
ప్రభాస్‌ని స్క్రీన్‌పై ఎన్ని అవతారాల్లో చూసిన చాలు అనిపించడం లేదు. అందుకేనేమో రెబల్ ఫ్యాన్స్ 'కన్నప్ప'లో ప్రభాస్ లుక్ కోసం చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఈ బజ్ ని దృష్టిలో పెట్టుకొనే మంచు విష్ణు మెగా ప్లాన్ వేశాడు. ఇప్పటి వరకు సినిమాలోని కీలక పాత్రల లుక్స్ అని రిలీజ్ చేసిన విష్ణు.. ప్రభాస్ లుక్ మాత్రం కాస్త ఆలస్యం చేశాడు. గత సోమవారం శివుడి పాత్రలో అక్షయ్ లుక్ రిలీజ్ చేయగా, కేవలం ప్రభాస్ లుక్ మాత్రమే బాకీ ఉంది. మరోవైపు ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్ మాసంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ లుక్ ని మహాశివరాత్రికి రిలీజ్ చేస్తారేమో అంతా భావించారు. కానీ విష్ణు సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు.
ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. ఎందుకంటే అందరి పాత్రలు ఎంతో కొంత కనిపించిన ప్రభాస్ నామాల దర్శనంతోనే ఫ్యాన్స్ కి సరిపెట్టేశాడు విష్ణు. విష్ణుకు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే దీంతో ప్రభాస్ ని చూడటానికి అందరిలో స్పెషల్ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విష్ణు తన సోమవారాల సెంటి మెంట్ తో వచ్చే సోమవారం(ఫిబ్రవరి 3)న ప్రభాస్ పోస్టర్ రిలీజ్ చేస్తామని ప్రకటించాడు. ప్రస్తుతానికి ఒక హాఫ్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. చాలామంది ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ప్రభాస్ విభిన్నంగా కనిపించడంతో ప్రశంసలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఇంటర్నెట్ లో ప్రభాస్ లుక్ లీక్ అయ్యింది. దీన్ని విష్ణు ఎలా కవర్ చేస్తాడో తెలియాలి అంటే ఫిబ్రవరి 3 వరకు వెయిట్ చేయాల్సిందే.
రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు మంచు విష్ణు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.