Prabhas: స్పిరిట్ హింట్ వచ్చేసింది..
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:39 PM
స్పిరిట్ మూవీ ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సెట్స్ కి ఎప్పుడు వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే డీ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit) సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో దక్షిణాదితో పాటు, బాలీవుడ్లో కూడా పాపులర్ అయిన సందీప్ ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా సెట్స్ కి ఎప్పుడు వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. తాజాగా యూఎస్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు షూటింగ్ అప్‌డేట్ పంచుకున్నారు. చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని, అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.
ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఇంత తొందరగా ప్రారంభం కానుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరోవైపు ఈ సినిమా మ్యూజిక్ సెటింగ్స్‌ని సందీప్.. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్‌తో కలిసి ఎప్పుడో ప్రారంభించారు.
ALSO READ: Mega 157: చిరంజీవి 157.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి హద్దే లేదు..
Harish Shankar: ఉస్తాద్ కథ ఎక్కడిదాకా వచ్చిందంటే..
Upasana: రామ్ చరణ్ పుట్టినరోజు ఎంతో ప్రత్యేకం.. ఉపాసన