Spirit: రెబల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పిరిట్ షూటింగ్ అప్పుడే

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:16 PM

Spirit: ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నా సంగతి తెలిసిందే. అయితే ఇందులో రెబల్ ఫ్యాన్స్ ని ఎక్కువగా ఎగ్జైట్ చేస్తున్న ప్రాజెక్ట్ 'స్పిరిట్'.

Spirit Movie Shooting Update

ప్రస్తుతం టాలీవుడ్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తో సినిమా అంటే ఏ హీరో ఫ్యాన్ అయినా ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే సందీప్ సినిమా అంటేనే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. మరి అలాంటి సందీప్ వంగా బాక్సాఫీస్ ను ఊపిరి తీసుకోకుండా చేసే రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నా సంగతి తెలిసిందే. అయితే ఇందులో రెబల్ ఫ్యాన్స్ ని ఎక్కువగా ఎగ్జైట్ చేస్తున్న ప్రాజెక్ట్ 'స్పిరిట్'. మరి ఈ సినిమా స్టోరీ ఎంత వరకు వచ్చింది? షూటింగ్ ఎప్పటి నుండి ప్రారంభిస్తారంటే..


ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'రాజా సాబ్' మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ప్రభాస్ ప్యారలల్ గా హను రాఘవపూడి 'ఫౌజి' సినిమా షూటింగ్ లోను పాల్గొంటున్నాడు. ఏప్రిల్ వరకు 'రాజా సాబ్' ప్రాజెక్ట్ నుండి పూర్తిగా ఫ్రీ అవుతాడు. మరోవైపు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పిరిట్' స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఫినిష్ చేశాడు. దీంతో 'మే' నుండే స్పిరిట్ షూట్ ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇది వరకు ఇదే విషయాన్నీ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ తెలిపాడు. ప్రస్తుతం సందీప్ మ్యూజిక్ సిట్టింగ్ లతో పాటు, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైమ్ పోలీసుగా కనిపించనున్నట్లు సమాచారం. దీంతో క్యారెక్టర్ మేక్ ఓవర్‌కి కొంచెం సమయం పడుతుందని అంతా భావించారు. కానీ.. మేలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండటం రెబల్ ఫ్యాన్స్ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. షింతో ప్రభాస్ ఇపుడు రాజా సాబ్, ఫౌజి, స్పిరిట్, సలార్ 2, కల్కి 2, హోంబలే ప్రొడక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు.

Updated Date - Jan 30 , 2025 | 04:19 PM