Pradhas: బ్లాస్టింగ్ కాంబోకు ముహూర్తం ఫిక్స్‌

ABN , Publish Date - Mar 21 , 2025 | 07:34 PM

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోతో తెరకెక్కబోతున్న 'స్పిరిట్'కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

ఇండస్ట్రీ లో మరో పవర్ ఫుల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. త్వరలో మరో బిగ్ బ్లాస్ట్ కు బీజం పడబోతుంది. ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా క్రేజీ కాంబో ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. చూస్తుంటే 2025 సినీ ఇండ‌స్ట్రీకి ప్రత్యేకంగా నిల‌వ‌బోతోంది. మోస్ట్ క్రేజియెస్ట్ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్థమౌతోంది. అందుకు త‌గ్గట్టుగానే మేక‌ర్స్ కూడా బాక్సాఫీస్ వద్ద మోత మోగించేలా అస్త్రాలను రెడీ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు సినిమాకు మొదటి అడుగు పడింది. ఇలాంటి టైంలో మరో బ్లాస్టింగ్ కాంబో సెట్స్ పైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో బాక్సాఫీస్ ఊచకోత ఎలా ఉండబోతుందా? అని ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి.

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), మహేశ్‌ బాబు (Mahesh Babu) కాంబినేషన్ తర్వాత అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్న కాంబోనే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), సందీప్ వంగా (Sandeep Reddy Vanga) ది. ఈ కాంబోలో సినిమా రాబోతోందని తెలిసినప్పటి నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమా పట్టాలెక్కుతుందా అని కళ్లలో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. మరి కొన్ని రోజుల్లో ఈ కాంబినేషన్ కు సంబంధించి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ''ది రాజాసాబ్, ఫౌజీ'' సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న డార్లింగ్.... 'స్పిరిట్' (Spirit) మూవీ సెట్స్ పైకి వచ్చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.


ప్రెజెంట్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న ప్రభాస్ ... త్వరలోనే 'స్పిరిట్' సెట్ లోకి అడుగుపెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఉగాది కానుకగా ఈ సినిమాను ప్రారంభించాలని సందీప్ రెడ్డి ఫిక్స్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ తో పాటు మ్యూజిక్ వర్క్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. దీంతో లేట్ చేయకుండా సినిమాను మొదలు పెట్టాలని భావించిన సందీప్ రెడ్డి.... ఉగాదికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడట. అయితే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వడానికి మాత్రం మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. 'యానిమల్‌'తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ సెట్ చేసిన సందీప్‌, డార్లింగ్ సినిమాను అంతకు మించి అన్న రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడట. ''ది రాజాసాబ్, ఫౌజీ'' చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో... 'స్పిరిట్' కు బల్క్ డేట్స్ ఇవ్వబోతున్నాడట. ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్ పోలీస్‌ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. జస్ట్ అప్ డేట్స్ తోనే పూనకాలు తెప్పించిన ఈ మూవీ .... నెక్ట్స్ ఎలాంటి వండర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారుతుందో చూడాలి.

Also Read: Naveen Chandra: విడుదలైన 'చెలియా చెలియా' సాంగ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 21 , 2025 | 07:35 PM