Kannappa: 'కన్నప్ప'లో ప్రభాస్ డాన్స్..
ABN , Publish Date - Jan 24 , 2025 | 09:14 AM
Kannappa: ప్రభాస్ పాత్ర గురించి విష్ణు గుట్టుగా ఉన్నాడు. . విష్ణుతో పాటు అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, మోహన్ వంటి లెజండరీ నటిస్తున్న సినిమాలో ప్రభాస్ కీలకం కానున్నాడు. ఎందుకంటే..
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' (Kannappa) ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రభాస్ మినహా అందరి క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నపటికే ప్రభాస్ చాలా కీలకం కానున్నాడు. విష్ణుతో పాటు అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, మోహన్ వంటి లెజండరీ నటిస్తున్న సినిమాలో ప్రభాస్ ఎందుకు అంతా కీలకం కానున్నడంటే..
మొదట ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తారని అంతా భావించారు. కానీ అక్షయ్ శివుడి పాత్రలో కనిపించడంతో.. ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే అభిమానులకు కిక్కేంచే న్యూస్ ఏంటంటే శివుడి పాత్ర కంటే ప్రభాస్ పోషిస్తున్న నందీశ్వరుడి(బసవయ్య) నిడివే సినిమాలో ఎక్కువ సేపు కనిపించనుందట. 20-30 నిమిషాల మేరకు ప్రభాస్ స్క్రీన్ పై కనిపించనున్నదాడు. అలాగే ప్రభాస్ ఇంట్రోనే ఒక సాంగ్ తో ప్రారంభించనున్నారట. ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫీ వహించారు. ఇందులో ప్రభాస్ చాలా డివోషనల్ గా కనిపించనున్నారు. మహాశివరాత్రి రోజు ప్రభాస్ లుక్ రివీల్ చేసే ఛాన్స్ ఉంది. ప్రభాస్ పాత్ర గురించి విష్ణు గుట్టుగానే ఉన్నా.. లుక్ ఇంటర్నెట్ లో లీక్ కావడం ఆందోళన కలిగించింది.
రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు మంచు విష్ణు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.