Prabhas: ఒక్క హీరో... ఏడు సినిమాలు.. ఎన్ని కోట్లంటే..

ABN , Publish Date - Feb 10 , 2025 | 10:49 AM

ఐదేళ్లగా ఆయన నటించిన ప్రతి చిత్రం తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేశాయి. రెబల్‌స్టార్‌ ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. బాక్సాఫీస్‌కు కింగ్‌గా నిలిచాడు.

ప్రభాస్‌ (Prabhas) టాలీవుడ్‌ హీరోనే.. కానీ అతని అభిమానగణం పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ రేంజ్‌లో ఉంది. ఆయన సినిమా రిలీజ్‌ అయిందంటే కోట్లు కొల్లగొట్టాల్సిందే. ప్రస్తుతం ఆయన బాక్సాఫీస్‌కు రారాజు(Boxoffice king) . ఐదేళ్లగా ఆయన నటించిన ప్రతి చిత్రం తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేశాయి. రెబల్‌స్టార్‌ ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ స్పెషల్‌ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. బాక్సాఫీస్‌కు కింగ్‌గా నిలిచాడు. బాహుబలి నుంచి ఇప్పటి దాకా ఈ ఎనిమిదేళ్లలో ఆయన నటించిన ఏడు సినిమాలకు గానూ రూ.5300 (5300 Crores) కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్‌ ఫిల్మ్‌ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. (Record break collections)




2015 నుంచి ప్రభాస్‌ (Darling prabhas) నటించిన ప్రతి సినిమా రూ.500 నుంచి 1000 కోట్ల మధ్యలో వసూళ్లు రాబట్టాయి. కొన్ని అయితే రూ.900 కోట్లు క్రాస్‌ చేశాయి. ప్రభాస్‌ సినిమాలకు విడుదలకు ముందు విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అవుతుంది.  అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు సైతం ఆయన సినిమాల కోసం వెయిట్‌ చేస్తుంటారు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో అరడజను చిత్రాలు ఉన్నాయి. గడిచిన తొమ్మిదేళ్లలో కేవలం 7 సినిమాల్లోనే నటించాడు. అతని బాక్సాఫీస్‌ వాల్యూ మాత్రం రూ.5300 కోట్లు. భారతీయ సినిమాల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా ప్రభాస్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశారు.

ప్రస్తుతం ప్రభాస్‌ రాజాసాబ్‌, ఫౌజీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. తదుపరి సలార్‌ 2, కల్కి -2 చిత్రాలతో బిజీ కానున్నారు. సందీప్‌రెడ్డి వంగాతో చేసే స్పిరిట్‌ కూడా త్వరలోనే సెట్స్‌ మీదకెళ్లనుందని తెలుస్తోంది.

Updated Date - Feb 10 , 2025 | 10:50 AM