Kalki 2898 AD: ప్రభాస్‌ని పట్టించుకోని ఆడియెన్స్
ABN , Publish Date - Jan 24 , 2025 | 09:50 AM
Kalki 2898 AD: ఇప్పటివరకు తెలుగు టెలివిజన్ చరిత్రలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా 29.4 రేటింగ్ తో సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 23.4 రేటింగ్ తో రెండో స్థానంలో నిలిచింది. కానీ ప్రభాస్ 'కల్కి 2898 AD' రికార్డును సృష్టించింది.. ఏంటంటే
ఇండియన్ బాక్సాఫీస్ బాద్ షా ప్రభాస్ సినిమాలు టాక్ ఎలా ఉన్నా కలెక్షన్ల విషయంలో మాత్రం ఊచకోతే ఉంటుంది. గతేడాది రిలీజైన ప్రభాస్ 'కల్కి 2898 AD' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్ల కలెక్షన్లను దాటి సరికొత్త చరిత్రను లిఖించింది. అలాగే ఓటీటీలోనూ రూ. 375 కోట్లకు అమ్ముడుపోయి.. అన్ని సినిమాలకంటే ఎక్కువ ధరలకు అమ్ముడుపోయిన సినిమాగా చరిత్ర సృష్టించింది. కానీ.. ఒక దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ పట్టించుకోలేదు. ఎపిక్ డిజాస్టర్ చేశారు. అది ఎక్కడో వేరే భాషలోనో, దేశంలోనో కాదు తెలుగులోనే. అదేంటి ప్రభాస్ యావరేజ్ సినిమానే సూపర్ హిట్ గా నిలిపే తెలుగోళ్ళే ఆయన సినిమాని డిజాస్టర్ చేయడం ఏంటని అనుకుంటున్నారా! కానీ.. ఇదే నిజం. ఇంతకీ ఏం జరిగిందంటే..
నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన 'కల్కి 2898 AD' సినిమాని జనవరి 12న టీవీల్లో ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ చేశారు. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. కానీ ప్రభాస్ విషయంలో అది ఫెయిల్ అయ్యింది. ఈ సినిమా టెలివిజన్ రైట్స్ ని జీ తెలుగు(Zee Telugu) భారీ ధరకు సొంతం చేసుకుంది. షోని టెలికాస్ట్ చేసే ముందే పోస్టర్లు, భారీ ప్రకటనలతో పెద్ద ప్రచారమే నిర్వహించారు. కానీ.. టీవీలో రిలీజ్ చేసిన తర్వాత ఒక్క ప్రేక్షకుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదు. ఈ సినిమాకి కేవలం 5.26 టీఆర్పీ వచ్చింది. ఈ భారీ బడ్జెట్, స్టార్ హీరో సినిమాకి ఇంతా రేటింగ్ వస్తే డిజాస్టర్ అంటారు. కానీ దీన్ని ఎపిక్ డిజాస్టర్ అంటున్నారు ఎందుకంటే..
ఇప్పటివరకు తెలుగు టెలివిజన్ చరిత్రలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా 29.4 రేటింగ్ తో సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 23.4 రేటింగ్ తో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ‘పుష్ప-1’, 'హనుమాన్', 'గుంటూరుకారం' సినిమాలు నిలిచాయి. వీటితో పోల్చుకుంటే కల్కి సినిమాని ఎపిక్ డిజాస్టర్ అనే అంటారు.
అయితే టీవీల్లో హిట్ అయినా సినిమాల్లో మ్యాగ్జిమమ్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ మాత్రమే ఉన్నాయి. కల్కి ఆ జోనర్ కి చెందిన మూవీ కాదు. ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ. కానీ.. ఇందులో సైన్సే లేదంటున్నారు విమర్శకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని మ్యాగ్జిమమ్ ఆడియెన్స్ థియేటర్స్, ఓటీటీలోనే చూశారు.