Prabhas: ప్రభాస్ 'డార్లింగ్' మిస్ చేసుకున్న గ్లోబల్ స్టార్ ఎవరంటే..
ABN , Publish Date - Jan 23 , 2025 | 07:54 AM
Prabhas: "దర్శకుడు కరుణాకరన్ మొదట ఈ కథను ఓ స్టార్ హీరోకు నేరేట్ చేశాడట.. కానీ ఆ హీరో ఈ ప్రాజెక్ట్ అంగీకరించలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చేతిలో పడింది. ఆ స్టార్ హీరో ఈ సినిమాకి ఎందుకు ఒప్పుకోలేదు? ఆ హీరో ఎవరంటే.."
రాజమౌళి బాహుబలి తరువాత ప్రభాస్ సూపర్ స్టార్‌డమ్ తో సరికొత్త పాన్ ఇండియన్ స్టార్ గా అవతారమెత్తారు. ఇప్పుడు ఆయన ఫ్యాన్‌డమ్ గ్లోబల్ స్థాయికి చేరింది. అయితే అంతకు ముందు కూడా ప్రభాస్ కి పిచ్చి క్రేజ్ ఉంది. ముఖ్యంగా అమ్మాయిలలో. ప్రత్యేకంగా 'డార్లింగ్' సినిమా అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు. అయితే ఈ సినిమా ఛాన్స్ ని ఒక స్టార్ హీరో వదిలేసుకున్న తర్వాతే ప్రభాస్ దగ్గరకి వచ్చిందనే విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరంటే..
ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన మరో కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ 'డార్లింగ్'. 2010లో రిలీజ్ అయినా ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రభాస్, కాజల్ కెమిస్ట్రీ జీవీ ప్రకాష్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి. అయితే కరుణాకరన్ మొదట ఈ కథను ఓ స్టార్ హీరోకి నేరేట్ చేశాడట.. కానీ ఆ హీరో ఈ ప్రాజెక్ట్ అంగీకరించలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చేతిలో పడింది. ఆ స్టార్ హీరో ఈ సినిమాకి ఎందుకు ఒప్పుకోలేదు? ఆ హీరో ఎవరంటే..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. అవును, దర్శకుడు కరుణాకరన్ మొదట ఈ కథను చరణ్ కి వినిపించాడు. కానీ.. దీనికి చరణ్ ఒప్పుకోలేదు. అప్పటికే చిరుత, మగధీర సినిమాలతో జోష్ మీదున్న చరణ్ అదే ఏడాది 'ఆరెంజ్' మూవీలో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినా విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్, రామ్ చరణ్ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ గా మారి రాణిస్తున్నారు. డైరెక్టర్ కరుణాకరన్ సాయి ధరమ్ తేజ్ తో తెరకెక్కించిన 'తేజ్ ఐ లవ్ యు’(2018) తర్వాత ఇంకో సినిమా చేయలేదు. ఏదిఏమైనప్పటికీ రామ్ చరణ్ డార్లింగ్ ప్రాజెక్ట్ చేసి ఉంటే టైటిల్ డిఫరెంట్ గా ఉండేది. ఎందుకంటే ప్రభాస్ అప్పటికే డార్లింగ్ పేరుతో ఎస్టాబ్లిష్ అయ్యాడు.