RC16: రంగస్థలాన్ని మించేలా క్లైమాక్స్...
ABN , Publish Date - Feb 06 , 2025 | 06:03 PM
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ‘ఉప్పెన’ (Uppena) క్లైమాక్స్ మరచిపోని విధంగా తీర్చిదిద్దారు. ఆ సినిమా మొత్తాని క్లైమాక్స్ హైలైట్ అని చెప్పొచ్చు.
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ (Ram charan) కెరీర్‌కు 'రంగస్థలం' (Rangastalam) బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. అందులో చిట్టిబాబుగా చరణ్ నటన వేరే లెవల్ అన్నట్లు ఉంటుంది. సినిమాలో ప్రతి సన్నివేశం కీలకమే అయినా క్లైమాక్స్ మాత్రం అంతకుమించి అన్నట్లు సుకుమార్ చిత్రీకరించారు. దాని వల్లే సినిమా ఓ రేంజ్‌కి వెళ్లింది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ‘ఉప్పెన’ (Uppena) క్లైమాక్స్ మరచిపోని విధంగా తీర్చిదిద్దారు. ఆ సినిమా మొత్తాని క్లైమాక్స్ హైలైట్ అని చెప్పొచ్చు.
ఇప్పుడు రామ్ చరణ్‌తో బుచ్చి (Buchibabu sana)ఓ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ హంగులతో రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమా పతాక సన్నివేశాలు కూడా ‘నెవర్ బిఫోర్’ అనే రేంజ్‌లో రాసుకొన్నాడట బుచ్చిబాబు. ఈ క్లైమాక్స్ మాక్స్ చాలా కాలం గుర్తుండిపోతుందని, మళ్లీ మళ్లీ ఈ క్లైమాక్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుందన్నది ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే కథ ఇది. దీనికి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కాబట్టి, అందరికీ అర్థమయ్యే టైటిల్ పెట్టాలనే యోచనలో మేకర్స్ ఉన్నారు.
సుకుమార్ సినిమాల్లో హీరోకి ఏదో ఓ వీక్ నెస్ ఉంటుంది. ‘రంగస్థలం’లో చరణ్‌కు సరిగా వినపడదు. అది కథకు బాగా ఉపయోగపడింది. ‘ఇప్పుడు ఆర్‌సీ 16లో కూడా రామ్‌చరణ్‌కు పాత్రకు లోపం ఉందని, దానితో నడిపించిన డ్రామా కథని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తుందని చెబుతున్నారు. ఈ చిత్రం మట్టి లాంటిదని, తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడుతోందని, తన గత చిత్రాలకు మించి ఉంటుందని రామ్‌చరణ్ ఓ సందర్భంలో చెప్పిన విషయం తెలిసిందే! ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.