Naveen Chandra: విడుదలైన 'చెలియా చెలియా' సాంగ్

ABN , Publish Date - Mar 21 , 2025 | 07:09 PM

'పొలిమేర' మూవీతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్... దానికంటే ముందే ఓ సినిమాను నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కించారు. ఆ సినిమా ఈ నెల 28న విడుదల కాబోతోంది.

'పొలిమేర' (Polimera) చిత్రంతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ (Dr Anil Vishwanath). ఆ సినిమా ఓటీటీలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో 'పొలిమేర -2'ను రూపొందించారు. ఇది థియేటర్లలో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు దాని మూడో భాగం రూపకల్పనలో ఉన్నారు డాక్టర్ అనిల్ విశ్వనాథ్‌. అయితే ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం '28 డిగ్రీస్ సి' మాత్రం విడుదల కాకుండానే ఉండిపోయింది. ఈ ఎమోషనల్ల ప్రేమకథా చిత్రంలో నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా నటించగా, షాలినీ వడ్నికట్టి (Shalini Vadnikatti) హీరోయిన్. ఇప్పుడీ సినిమాను ఇదే నెల 28న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి నిర్మాత సాయి అభిషేక్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఈ చిత్రంలోని 'చెలియా చెలియా...' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.


'చెలియా చెలియా..' లిరికల్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ (Shrawan Bharadwaj) బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా...కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు. సింగర్ రేవంత్ ఆకట్టుకునేలా పాడారు. ఈ సినిమా గురించి డా. అనిల్ విశ్వనాథ్‌ మాట్లాడుతూ, ''మనసును తాకే భావోద్వేగాలతో ఆద్యంతం సాగే అద్భుతమైన ప్రేమ కథా చిత్రం'' ఇది అని అన్నారు. హీరో నవీన్ చంద్ర మరోసారి ఎమోషనల్ ప్రేమకథలో తన నటనతో ఆకట్టుకోబోతున్నాడని, లవ్ స్టోరీలో ఉండాల్సిన అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయని తెలిపారు. టెంపరేచర్ కథలో ఎంత కీ రోల్ ప్లే చేస్తుందని, అందుకే దీనికి '28 డిగ్రీస్ సి' అనే పేరు పెట్టామని చెప్పారు. ఒక డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇందులో జయప్రకాష్, ప్రియదర్శి పులికొండ, హర్ష చెముడు, రాజా రవీంద్ర, అభయ్ బేతిగంటి, దేవియాని శర్మ, సంతోషి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి శ్రీచరణ్‌ పాకాల (Sricharan Pakala ) నేపథ్య సంగీతం అందించారు.

Also Read: Good Bad Ugly: డీఎస్పీ తప్పుకోడానికి రీజన్ అతనే...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 21 , 2025 | 07:09 PM