Tollywood: పొయెటిక్ లవ్ స్టోరీగా 'కాలమేగా కరిగింది'
ABN , Publish Date - Mar 15 , 2025 | 04:53 PM
ప్రేమకథా చిత్రాన్ని కాస్తంత కొత్తగా తీస్తే చాలు ప్రేక్షకులు ఠక్కున కనెక్ట్ అవుతారు. అలాంటి ఓ మ్యూజికల్ లవ్ స్టోరీనే 'కాలమేగా కరిగింది'. ఈ సినిమా ఇదే నెల 21న విడుదల కాబోతోంది.
వినయ్ కుమార్ (Vinay Kumar), శ్రావణి మజ్జరి (Sravani Majjari), అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'కాలమేగా కరిగింది' (Kaalamega Karigindhi). ఈ సినిమాను మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'కాలమేగా కరిగింది' ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న రిలీజ్ కు రెడీ అవుతోంది. శనివారం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
'కాలమేగా కరిగింది' ట్రైలర్ ను గమనిస్తే... ఇదో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. గత జ్ఞాపకాలను వెతుక్కుంటూ ఓ యువకుడు తన పాఠశాల బాట పట్టడమే ఈ చిత్రంలోని ప్రధానాంశం. ఫణి, బిందు విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి ప్రేమికులు. అమాయకత్వం నిండిన స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎంతో సంతోషాన్నిస్తుంది. తమ ప్రేమే లోకంగా జీవిస్తుంటారు ఇద్దరు. కలహాలే లేని ఈ ప్రేమ కథను కాలం విడదీస్తే ఆ జ్ఞాపకాలు వెతుక్కుంటూ కథానాయకుడు ఫణి ప్రయాణం సాగిస్తాడు. బిందుతో కలిసి చదువుకున్న స్కూల్, తామిద్దరు మాట్లాడుకున్న ప్లేస్ లు...అన్నింటిలో ప్రేమను గుర్తుల్ని పోగేసుకుంటాడు. ఈ ప్రేమికులు తిరిగి ఎలా కలిశారు అనేది ట్రైలర్ లో ఆసక్తిని కలిగించింది. ఈ ప్లెజంట్ లవ్ స్టోరీని పొయెటిక్ గా అందంగా రూపొందించారు దర్శకుడు శింగర మోహన్. గుడప్పన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ట్రైలర్ లో ఆకట్టుకుంది.
Also Read: Lucifer 2: లూసిఫర్ 2 వాయిదా.. దర్శకుడు కామెంట్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి