Hari Hara Veera Mallu: పవన్ అంటే భయం లేదా..
ABN , Publish Date - Jan 20 , 2025 | 08:08 AM
Hari Hara Veera Mallu: "పవన్ సినిమా వస్తుందంటే.. అటు ఓ వారం, ఇటు ఓ వారం గ్యాప్ వదిలేయాల్సిందే. కానీ.. అదే వారంలో 4 నాలుగు చిన్న, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. పవన్ సినిమా అంటే మిడ్ రేంజ్ కాదు చిన్న హీరోలకు కూడా భయం లేదా లేకపోతే సినిమా.."
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావడంతో ఇండస్ట్రీలో ఆయన సినిమాలంటే భయం పోయిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పవన్, సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఓజీ' సినిమాపై ఎన్నో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ 'హరి హర వీర మల్లు' సినిమా పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. మూడేళ్ళ క్రితం స్టార్ట్ అయినా ఈ సినిమా అనేక కారణాల వల్ల నత్త నడక నడుస్తోంది. ప్రధానంగా ఈ సినిమా నుండి డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడం అభిమానులని పెద్ద తీసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఏర్పడిన మరికొన్ని పరిణామాలు చూస్తే.. పవన్ సినిమా అంటే మిడ్ రేంజ్ కాదు చిన్న హీరోలకు కూడా భయం లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత ఎ.ఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్టర్ గా మారాడు. ఇది పక్కనా పెడితే ఈ సినిమాని మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. అయితే పవన్ సినిమా వస్తుందంటే.. అటు ఓ వారం, ఇటు ఓ వారం గ్యాప్ వదిలేయాల్సిందే. కానీ.. అదే వారంలో 4 నాలుగు చిన్న, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. హరి హర వీర మల్లు రిలీజ్ డేట్ రోజే.. మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. పవన్ సినిమా అంటే భయం పోయిందా? లేదా హరి హర వీర మల్లు వాయిదా పడనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
హరి హర వీర మల్లు రిలీజ్ అవుతున్న మార్చి 28న విజయ్ దేవరకొండ 12వ సినిమా, నితిన్ 'రాబిన్‌హుడ్' సినిమా రిలీజ్ కానున్నాయి. నెక్స్ట్ రోజే చిన్న సినిమా 'మ్యాడ్ 2' రిలీజ్ కానుంది. కొన్ని రోజుల గ్యాప్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ సినిమా రిలీజ్ కానుంది. అంతకు ముందు ప్రియదర్శి 'కోర్టు' డ్రామా మూవీ రిలీజ్ కానుంది.