Pawan Kalyan: ఆ చిత్రాల జాబితాలో తీన్ మార్

ABN , Publish Date - Mar 08 , 2025 | 05:43 PM

14 సంవత్సరాల క్రితం జనం ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' చిత్రం అప్పుడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఇప్పుడు దానిని రీ-రిలీజ్ చేయమని పవన్ ఫ్యాన్స్ నిర్మాత బండ్ల గణేశ్ ను కోరుతున్నారు. దీనికి బండ్ల గణేశ్ కండీషన్స్ అప్లయ్ అంటూ బదులిస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'తీన్ మార్' (Teen Maar) చిత్రం 2011లో విడుదలైలంది. హిందీ చిత్రం 'లవ్ ఆజ్ కల్' (Love Aaj Kal) కు రీమేక్ అయిన ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ సరసన త్రిష (Trisha) , కృతీ కర్బందా నటించారు. బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) నిర్మించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. జయంత్ సి. పరాన్జీ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో తెలుగు వారిని ఆకట్టు కోలేకపోయింది. హిందీలో మంచి విజయం సాధించినా... తెలుగు రీమేక్ ను ఎందుకో జనాలు తిరస్కరించారు. అయితే ఈ సినిమా కోసం మణిశర్మ (Mani Sharma) సమకూర్చిన బాణీలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. అంతేకాదు... ఇప్పటికీ ఈ పాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉన్నాయి.

Also Read: Sonakshi Sinha: జటాధర కోసం సోనాక్షిసినా ఎంట్రీ..


పవన్ కళ్యాణ్ నటించిన పలు చిత్రాలు ఇప్పుడు రీ-రిలీజ్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'ఖుషీ' వంటి సినిమా రీ-రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో 'తీన్ మార్' సినిమాను కూడా రీ-రిలీజ్ చేయమంటూ నిర్మాత బండ్ల గణేశ్ ను కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుతున్నారు. ఈ మూవీకి క్వాలిటీని మరింత పెంచడం కోసం తిరిగి డబ్బింగ్ చెప్పించి, సౌండ్ సింక్ ను పర్ ఫెక్ట్ గా చేసి.. మరోసారి జనం ముందుకు తీసుకు రావాలని తనకూ ఉందంటూ బండ్ల గణేశ్‌ పవన్ అభిమానులకు తెలియచేశాడు. అయితే... ఈ ఈ సినిమాను ఈసారి బ్లాక్ బస్టర్ చేస్తానంటే తాను రెడీ అంటూ బండ్ల గణేశ్‌ చెప్పాడు. మరి ఈ సినిమాతో వచ్చిన లాభాలు కొంత జనసేన పార్టీ ఫండ్ గా ఇస్తావా? అంటూ మరికొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశ్నించారు. కొంతేమిటీ... మొత్తం లాభాలన్నీ పార్టీ ఫండ్ గా ఇస్తానని బండ్ల గణేశ్‌ బదులిచ్చాడు.

Also Read: Court: అలా అనిపిస్తే హిట్‌ 3 చూడొద్దు...


'తీన్ మార్' సినిమా అప్పట్లో పరాజయం పాలైనా... ఆ సినిమా కంటూ కొందరు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా పాటలను వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అలా ఇప్పుడు గనుక 'తీన్ మార్' విడుదలైతే... బ్లాక్ బస్టర్ కాదు గానీ... చక్కని ఆదరణ అయితే పొందే ఆస్కారం ఉంది. సో... అందుకు ఫిక్స్ అయ్యి... బండ్ల గణేశ్‌ దీనిని రీ-రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది. ఒకవేళ ఈ సినిమా రీ-రిలీజ్ అయితే... ఎప్పుడు ఉంటుందనే సందేహాన్నీ కొందరు వ్యక్తం చేస్తున్నారు. బండ్ల గణేశ్ సినిమాను మరింత బెటర్ చేసి రిలీజ్ చేస్తా అంటున్నారు కాబట్టి... ఈ యేడాది ద్వితీయార్థం లేదా పవన్ కళ్యాణ్‌ బర్త్ డే అయిన సెప్టెంబర్ 2న ఉండొచ్చని కొందరి అంచనా.

Also Read: Reba Vs Ketika: అందాల భామల హాట్ సాంగ్స్

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 08 , 2025 | 06:26 PM