Panjaa Director Vishnu Vardhan: పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం .. ‘పంజా’ దర్శకుడి స్పందనిదే!
ABN , Publish Date - Jan 29 , 2025 | 09:55 AM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘పంజా’ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం సాధించకపోయినా.. మేకింగ్ విషయంలో మాత్రం ఫ్యాన్స్‌కి ఇప్పటికీ అది కల్ట్ సినిమానే. ముఖ్యంగా ‘పంజా’ సినిమాలో పవన్ కళ్యాణ్‌ని విష్ణు వర్ధన్ చూపించిన తీరుకి అంతా ఫిదా అయ్యారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న విష్ణు వర్ధన్, పవర్ స్టార్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే..
పవర్ స్టార్, ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘పంజా’ అనే స్టైలిష్ మూవీని రూపొందించిన దర్శకుడు విష్ణు వర్ధన్. ‘పంజా’ తర్వాత మళ్లీ తెలుగులో కనిపించని ఈ దర్శకుడు.. ప్రస్తుతం ఓ ప్రేమ కథా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆకాష్ మురళి, అదితి శంకర్ (డైరెక్టర్ శంకర్ కుమార్తె) హీరోహీరోయిన్లుగా విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ సినిమా ఇటీవల సంక్రాంతికి ‘నేసిప్పాయా’ పేరుతో తమిళ్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమిస్తావా’గా తీసుకొస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ప్రేమిస్తావా’ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసేందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు విష్ణు వర్ధన్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు.
Also Read- Fatima Sana Shaikh: ఓ తెలుగు నిర్మాత పచ్చిగా అడిగాడు.. ‘దంగల్’ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘దాదాపు ఏడెనిమిదేళ్ల తర్వాత తెలుగువారిని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను తెలుగులో మాట్లాడితే మా అమ్మ చాలా సంతోషిస్తుంది. అమ్మ కోసం తెలుగులో మాట్లాడుతుంటాను. మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌కు చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఆకాష్-అదితి మధ్య ప్రేమ గురించి చెబుతుంది. ప్రస్తుతం సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఇందులో అదితి, ఆకాష్ వారి పాత్రలలో చాలా చక్కగా నటించారు. కొన్ని సన్నివేశాల్లో వారి నటన చూసి నేను కూడా ఎమోషనల్ అయ్యాను. లవ్ స్టోరీలో సాలిడ్ డ్రామా అనేది ఎప్పుడూ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ డ్రామాని సపోర్ట్ చేస్తూ మిగతా క్యారెక్టర్స్ చేసిన శరత్ కుమార్, ఖుష్బూ, ప్రభుగారికి థ్యాంక్స్.
Taapsee Pannu: 15 ఏళ్లలో తొలిసారి ఆ దర్శకుడు నన్ను ఆహ్వానించాడు
ఇలాంటి స్క్రిప్ట్‌ను నిర్మాతలు ఒప్పుకోవడడమే పెద్ద సాహసం. యువన్ శంకర్ రాజా నా స్కూల్ మేట్. అప్పటి నుంచి అతని సంగీతం తెలుసు. నా సినిమాలన్నింటికీ ఆయనే సంగీతం చేస్తారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారని తెలిసి సినిమాకు వచ్చే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఈ సినిమా కోసం ఎంతోమంది గొప్ప టెక్నీషియన్స్ పని చేశారు. ఎప్పటిలాగే మీ అందరి సపోర్ట్ నాకు, ఈ సినిమాకు ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.
Also Read- Wife Off Movie Review: బావని చిన్నప్పుడే భర్తగా ఊహించుకున్న మరదలు వేశ్యగా ఎందుకు మారింది?
పవన్ కళ్యాణ్ ఒక పవర్:
పవన్ కళ్యాణ్.. ఆయనొక పవర్. నేను ఆయనతో వర్క్ చేసినప్పుడు గమనించింది ఏమిటంటే.. స్ట్రయిట్, టాలెంటెడ్ అయితే.. అలాంటి వారిని ఆయన చాలా ఇష్టపడతారు. ఎందుకంటే, ఆయన కూడా అలానే మాట్లాడతారు. ఇది నిజం. నాకు అప్పుడే అర్థమైంది. ఆయనలో ఒక పవర్ ఉందని. అలాగే ఆయనలో చిన్నపిల్లాడి మనస్థత్వం కూడా గమనించాను. ప్రతి విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉంటారు. ఇప్పుడాయన డిప్యూటీ సీఎం. ఆయనని కలిసి చాలా కాలం అయింది. ఇప్పటికీ ఆయన అంతే ఎనర్జీతో ఉన్నారు. ఆయన చాలా ఎత్తుకు ఎదుగుతారని పంజా సినిమా టైమ్‌లోనే నాకు అర్థమైంది. ఆయన మనసు నిజంగా చాలా మంచిది. ఆయన పోరాటం, డిప్యూటీ సీఎం అవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పారు.