SaiRam Shankar: ప్రేక్షకులు 'ఒక పథకం ప్రకారం' హిట్ చేశారు

ABN , Publish Date - Feb 08 , 2025 | 02:43 PM

'ఒక పథకం ప్రకారం'. సినిమా  విలన్ ఎవరో కనిపెడితే పదివేలు ఇస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన ఆఫర్‌తో సినిమా మీద అందరికీ ఆసక్తి ఏర్పడింది. దీంతో సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణను చూసిన చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చింది.   

దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయి రామ్ శంకర్ (Sairam shankar) నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ఒక పథకం ప్రకారం'.  గార్లపాటి రమేష్ తో కలిసి దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ (Vinod kumar Vijayan) నిర్మించారు . ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీలక్ష్మి ఫిలిమ్స్‌పై బాపిరాజు ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. సినిమాకు వస్తున్న స్పందన పట్ల యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. విలన్ ఎవరో కనిపెడితే పదివేలు ఇస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన ఆఫర్‌తో సినిమా మీద అందరికీ ఆసక్తి ఏర్పడింది. దీంతో సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణను చూసిన చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోలో 18 మంది మీడియా సభ్యులు విలన్ ఎవరనేది ఇంటర్వెల్ కంటే ముందు సీక్రెట్ చిట్స్ ద్వారా తెలిపారు. ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున 18 వేల రూపాయలను దర్శక నిర్మాతలు అందజేశారు

సాయి రామ్ శంకర్ (SaiRam Shankar) మాట్లాడుతూ.. ‘‘ఒక పథకం ప్రకారం’ సినిమాను చాలా చోట్ల రిలీజ్ చేశారు. చూసిన ప్రతీ ఒక్కరూ అద్భుతంగా ఉందని అంటున్నారు. మేం అనుకున్నట్టుగానే అందరికీ రీచ్ అయింది. సముద్రఖని పాత్రకు అందరూ కనెక్ట్ అవుతున్నారు. పెద్ద ఓపెనింగ్స్ అని చెప్పను గానీ.. మా కథ, మా సినిమా బలంగా ఉందని చెప్పగలను. మా మూవీని చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు.  విలన్‌ను కనిపెడితే పది వేలు ఇస్తామని ప్రకటించాం. చాలా చోట్ల లక్కీ డిప్ ద్వారా ఆడియెన్స్‌కు  బహుమతి ఇచ్చాం" అని అన్నారు.
దర్శక, నిర్మాత వినోద్ విజయన్ మాట్లాడుతూ.. ‘‘ఒక పథకం ప్రకారం’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని చోట్ల నుంచి మాకు ఆదరణ లభిస్తోంది" అని అన్నారు.  ఈ కార్యక్రమంలో నిర్మాత గార్లపాటి రమేష్ కూడా పాల్గొన్నారు.

Oka Pathakam Prakaaram Review: 'ఒక పథకం ప్రకారం' పూరీ తమ్ముడికి హిట్‌ ఇచ్చిందా..


Updated Date - Feb 08 , 2025 | 02:44 PM