Odela -2: భైరవి పాత్ర చేయడం అదృష్టమన్న తమన్నా

ABN , Publish Date - Mar 22 , 2025 | 07:29 PM

తమన్నా కీలక పాత్ర పోషించిన 'ఓదెల -2' రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ఇందులో పోషించిన భైరవి పాత్ర తనకెంతో ప్రత్యేకమైందని తెలిపింది తమన్నా.

పాన్ ఇండియా స్టార్ తమన్నా భాటియా (Thamannah Bhatia) హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2' (Odela -2) లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి ఇది సీక్వెల్. అశోక్ తేజ (Ashok Teja) దర్శకత్వంలో డి. మధు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ, ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న 'ఓదెల-2' థియేటర్స్ లో విడుదల కానుంది. తమన్నా ఫస్ట్ పోస్టర్ లో ఆభరణాలతో సాంప్రదాయ దుస్తులు ధరించి, ఒక సాధారణ మహిళగా కనిపిస్తునే ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్, గాయం గుర్తులతో ఉన్నారు. దాంతో ఆమె పాత్రపై క్యూరియాసిటీ పెరిగింది. ఆ తర్వాత వారణాసి నేపథ్యంలో మిస్టీరియస్ లేయర్ ని యాడ్ చేస్తున్నాయి.

'ఓదెల -2'లోని తన పాత్ర గురించి తమన్నా మాట్లాడుతూ, ''సంపత్ నంది (Sampath Nandi) 'ఓదెల పార్ట్-2' ఐడియా చెప్పినప్పుడు ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఈజీ జోనర్ కాదు. ఒక పల్లెటూరి కథని ఇంత ఎక్సైటింగ్ గా, థ్రిల్లింగ్ గా చెప్పడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ అశోక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో తీశారు. నేను ఏ సినిమా చేసిన ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఉండాలని కోరుకుంటాను. అలాంటి కొత్త ఓ కొత్త అనుభూతిని ఇచ్చే సినిమా ఇది. భైరవి క్యారెక్టర్ చేయడం యాక్టర్ గా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ లో హైయెస్ట్ ఐషాట్ క్లోజప్స్ ఉన్న సినిమా ఇదే. భైరవి క్యారెక్టర్ ని బిలీవబుల్ గా, నేచురల్ గా, మ్యాజికల్ గా చూపించడం నిజంగా బిగ్ ఛాలెంజ్. ఇది గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా'' అని అన్నారు.


o copy.jpgమూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ, ''ఓదెల సినిమా నాకు ఒక ఎమోషన్. నేను ఆ ఊర్లో పుట్టి పెరిగాను. చాలా గౌరవంగా ప్రేమతో ఈ సినిమాని రాసి, తీయడం జరిగింది. ఊరిని కాపాడేది ఆ ఊర్లో ఉన్న ఇలవేల్పు దేవుడి గుడి. ఒక లైన్ లో చెప్పాలంటే.. ఓదెల విలేజ్ లో ఒక కష్టం వస్తే ఆ కష్టం పెద్దదైతే ఆ ఊరిలో ఉన్న ఓదెల మల్లన్న నాగ సాధు క్యారెక్టర్ ద్వారా ఎలా పరిష్కరించారనేదే ఈ కథ. సినిమా ప్రేమించే ప్రేక్షకులు ఎక్కడున్నా ఈ సినిమాని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భైరవి పాత్రలో తమన్నా గారు చాలా అద్భుతంగా నటించారు. ఈ పాత్ర తమన్నా కోసమే పుట్టింది. ఆమెను వెతుక్కుంటూనే వెళ్ళింది. 20 ఏళ్లుగా తమన్నా గొప్ప డెడికేషన్ తో యాక్టింగ్ చేస్తూ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇది మామూలు జర్నీ కాదు. నేను పదేళ్ల క్రితం ఏ డెడికేషన్ తనలో చూశానో ఇప్పుడు కూడా అదే డెడికేషన్ తో ఉన్నారు. ఈ సినిమాకు అజనీశ్‌ లోక్ నాథ్ అద్భుతమైన సంగీతం అందించారు'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటి పూజా, నటులు వశిష్ఠ సింహా, నాగ మహేశ్‌, గగన్, దర్శక నిర్మాతలు అశోక్ తేజ, డి. మధు తదితరులు మాట్లాడారు.

Also Read: Pooja Hegde: పట్టించుకోవడం లేదంటున్న పూజా బేబీ...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 22 , 2025 | 07:29 PM