Odela 2 Controversy: ఓదేల-2లో అభ్యంతరకర దృశ్యాలు తొలగించాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 09:57 AM

ఓదెల 2 చిత్రం చిక్కుల్లో పడింది. సినిమాలో అభ్యంతరకరమైన దృశ్యాలు ఉన్నాయంటూ పలువురు కేసు ఫైల్ చేసారు. 

ఓదెల-2 (Odela 2)చిత్రంలో కులం పేరుతో ఉన్న అభ్యంతరకరమైన దృశ్యాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, ప్రాంతీయ సెన్సార్‌ బోర్డు అధికారులకు.. తెలంగాణ బీసీ కమిషన్‌(Telangana BC Commission) సూచించింది. ఈ సినిమాలో ఓ వివాహ సన్నివేశంలో పిచ్చిగుంట్ల కులంపేరును అభ్యంతరకరంగా వాడినట్టుగా ఆకులానికి చెందిన ప్రతినిధి పి.మల్లేష్‌ బీసీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే అత్తాపూర్‌ పీఎస్‌(Attapur PS)లో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవలేదని బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. శుక్రవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు నిరంజన్‌ లేఖ రాస్తూ వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు. ఆ సినిమా ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌, రచయితతోపాటు అభ్యంతర పదాలను వాడిన నటులపై చర్యలు తీసుకోవాలని కోరారు. థియేటర్‌లో ఆ సన్నివేశాలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని డీజీపీకీ లేఖ ప్రతిని పంపినట్లు తెలిపారు. సెన్సార్‌ బోర్డు అధికారి రాహుల్‌ గౌలీకర్‌ దృష్టికి తీసుకువెళ్లగా తొలగిస్తామని హామీ ఇచ్చినట్టు వివరించారు.

Updated Date - Apr 26 , 2025 | 09:57 AM