NTR x Neel: ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌లో మెరుపులాంటి హీరో

ABN , Publish Date - Feb 06 , 2025 | 07:16 AM

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గటుగానే మేకర్స్ చాలా జాగ్రత్తులు తీసుకుంటున్నారు. కేవలం నటించింది మలయాళంలో సినిమాలో అయినా జాతీయ స్థాయి క్రేజ్ సంపాదించుకున్న అద్భుతమైన యాక్టర్ సినిమాలో నటించనున్నాడని సమాచారం. దీంతో ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇంతకు ఆ హీరో ఎవరంటే..

Jr NTR

‘దేవర’ తరవాత ‘వార్‌ 2’ (War 2) షూటింగ్‌లో బిజీ అయ్యారు ఎన్టీఆర్‌. మరోవైపు ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ సినిమాకు సంబంధించి రంగం సిద్థం అవుతోంది. ఇందులో ఓ కథానాయికగా ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ నటిస్తోంది. అయితే మరో రెండు కీలక పాత్రల కోసం ఇద్దరు మలయాళ నటులకు చోటు దొరకిందని తెలిసింది. అందులో ఒకరు బీజూ మీనన్‌(Biju menon), మరొకరు టొవినో థామస్‌ (Tovino Thomas). మలయాళ ఇండస్ర్టీలో బెస్ట్‌ యాక్టర్స్‌గా పేరు పొందిన స్టార్లు వీరు. ఈ ఇద్దరి రాకతో ఈ సినిమాకు మరింత వన్నె వచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.


తాజాగా టొవినో థామస్.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టొవినో తారక్ ప్రాజెక్ట్ లో ఫిక్స్ అయినట్లే అంటున్నారు. ఇప్పటికే ‘మిన్నల్‌ మురళి’ ‘2018’, ‘ఎ.ఆర్‌.ఎమ్‌’ సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా టొవినో థామస్ మంచి పేరు సంపాదించుకున్నాడు.

tovinothomas.jpg

ప్రస్తుతం ఈ ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మైత్రీ మూవీస్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నాయి. ‘డ్రాగన్‌’ అనే పేరు పరిశీలనలో వుంది. 2026 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది చిత్ర యూనిట్‌ ప్లాన్‌. ఈ యేడాది ఎన్టీఆర్‌ నుంచి ‘వార్‌ 2’ రాబోతోంది. మరో నాలుగు నెలల తర్వాత ప్రశాంత్‌ నీల్‌ సినిమా వస్తుంది.


మరోవైపు మోస్ట్ అవెయిటింగ్ మల్టీ స్టారర్ మూవీ 'వార్ 2'. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తుండగా ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ -హృతిక్ రోషన్‌కు మధ్యలో భారీ యాక్షన్ ప్యాక్‌డ్ సీక్వెన్సెస్ ప్లాన్ చేశారు. వీరిద్దరి మధ్య 'హ్యాండ్ టూ హ్యాండ్' ఫైట్ సీక్వెన్సెస్ ఉండనున్నాయి. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఏడాది ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Feb 06 , 2025 | 07:43 AM