RRR: అశ్విన్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ గరంగరం
ABN , Publish Date - Feb 24 , 2025 | 06:57 PM
రాజమౌళి తెరకెక్కించిన 'ట్రిపుల్ ఆర్' మూవీలో కీలక పాత్రధారి ఎవరు అనే అంశంలో సోషల్ మీడియాలో ఇప్పటికే ఎంతో చర్చ జరిగింది. మరోసారి అలాంటి చర్చకు క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆజ్యం పోశాడు.
ఆదివారం ఇండియా పాకిస్థాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోపీ (ICC Champions Trophy) లో లీగ్ మ్యాచ్ జరిగింది. ఇండియా ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ గురించి ఇండియన్ స్పిన్సర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తన యు ట్యూబ్ ఛానెల్ లో పెట్టిన ప్రివ్యూ టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫ్యాన్స్ మధ్య మరోసారి చిచ్చుపెట్టింది. ఇండియా, పాకిస్థాన్ కెప్టెన్స్ వెనుక ఇద్దరు ప్లేయర్స్ స్థానంలో ట్రిపుల్ ఆర్ (RRR) మూవీలో నటించిన ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ramcharan) పిక్స్ పోస్ట్ చేసి అందులో ఇండియన్ కెప్టెన్ వెనుక ఉన్న చరణ్ ఫేస్ కి తన ఫేస్ ను మార్ఫ్ చేసి పాక్ కెప్టెన్ వెనుక ఉన్న ఎన్టీఆర్ ఫేస్ ని పాక్ ప్లేయర్ ఫేస్ తో మార్ఫ్ చేశాడు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి వివాదానికి దారితీసింది.
'ట్రిపుల్ ఆర్' మూవీ రిలీజ్ రోజు నుంచి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నడుమ సోషల్ మీడియా వార్ నడుస్తోంది. లేటెస్ట్ గా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ముందు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో పెట్టుకున్న వీడియో థంబ్ నైల్ తో మరోసారి సోషల్ మీడియాలో వీరిమధ్య రచ్చ మొదలైంది. మెయిన్ లీడ్ రామ్ చరణ్ కాబట్టి అశ్విన్ తనని ఫేస్ ను రామ్ చరణ్ కి పెట్టుకున్నాడని, ఎన్టీఆర్ ని పాకిస్తాన్ టీమ్ వ్యక్తికి సెట్ చేశాడని చెర్రీ అభిమానులు అంటున్నారు. అంతేకాదు... ఇప్పుడుకైనా సినిమాలో మెయిన్ హీరో ఎవరో తెలుసుకోవాలి అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులను ట్రిగ్గర్ చేస్తున్నారు. పాకిస్థాన్ ప్లేయర్ ని ఎన్టీఆర్ బాడీకి పెట్టడం దారుణమైన విషయం అని ఇటు వైపు తారక్ ఫ్యాన్స్ సైతం సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఇలా రవిచంద్రన్ అశ్విన్ ఫ్యాన్స్ ని కెలుక్కొని సోషల్ మీడియాలో చర్చకి తెర లేపాడు. ఇది ఎప్పటికి చల్లారుతుందో తెలియడం లేదు. ఇదిలా ఉంటే ఆగ్రహించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అశ్విన్ ఏం సమాధానం చెబుతాడో చూడాలి.