NTR-Neel: ఎన్టీఆర్‌ ఫొటో.. నీల్‌ భార్య లీక్‌...

ABN , Publish Date - Mar 23 , 2025 | 03:51 PM

ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌ - నీల్‌ షూట్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకున్నట్లు తెలిసింది. శనివారం సాయంత్రం వీరిద్దరూ రిలాక్స్‌ అవుతూ కనిపించారు

ఎన్టీఆర్‌ (Jr Ntr) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ (prashanth neel) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్‌ - నీల్‌ షూట్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకున్నట్లు తెలిసింది. శనివారం సాయంత్రం వీరిద్దరూ రిలాక్స్‌ అవుతూ కనిపించారు. సరదాగా మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోని ప్రశాంత్‌ నీల్‌ సతీమణి లిఖిత (neel wife Likhita)ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేశారు. వీరిద్దరినీ చూస్తుంటే కేవలం భయం అనే ఒకే ఒక్క మాట గుర్తుకు వస్తోందనే అర్థం వచ్చేలా క్యాప్షన్‌ ఇచ్చారామె.  ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. బ్లాక్‌బస్టర్‌ పక్కా అని అభిమానులు కామెంట్స్‌ పెడుతున్నారు.


ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘దేవర’ (Devara)ఇప్పుడు జపాన్‌లో రిలీజ్‌కు సిద్థమైంది. మార్చి 28న ఈసినిమా అక్కడ విడుదల కానుంది. డ్రాగన్‌ (వర్కింగ్‌ టైటిల్‌) తారక్‌ నటిస్తోన్న 31వ చిత్రమిది. షూటింగ్‌లో భాగంగా ఇటీవల రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్థం చేసి, సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌ కనిపించనుంది. టొవినో థామస్‌ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Mar 23 , 2025 | 03:52 PM