Hit 3: శ్రీనిధిశెట్టి ప్రేమ వెల్లువలో నాని...
ABN , Publish Date - Mar 22 , 2025 | 02:29 PM
నాని, శైలేష్ కొలను కాంబోలో 'హిట్ 3' మూవీ మే 1న విడుదల కాబోతోంది. ఈ సినిమాలోని 'ప్రేమ వెల్లువ' గీతం 24న జనం ముందుకు రాబోతోంది.
నేచురల్ స్టార్ నాని (Naani) ఏ పాత్ర పోషించినా అందులో పూర్తి స్థాయిలో నిమగ్నమై పోతుంటాడు. విశేషం ఏమంటే... అది హీరో పాత్ర మాత్రమే కానవసరం లేదు.. నిర్మాత పాత్ర అయినా! ఆ విషయం అతను ప్రొడ్యూస్ చేసిన చిత్రాలను, అవి సాధించిన విజయాలను చూస్తే అర్థమౌతుంది. తొలి చిత్రం 'అ' ను పక్కన పెడితే... ఇప్పటికే 'హిట్ (Hit), హిట్ -2' (Hit -2) చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు తాజాగా 'కోర్ట్' (Court) మూవీతో హ్యాట్రిక్ సాధించాడు. ఇప్పటికే యాభై కోట్ల గ్రాస్ కు 'కోర్ట్' దగ్గరైంది. దాంతో ఆ సినిమా ప్రమోషన్స్ ను పక్కన పెట్టి... మే 1న విడుదల కాబోతున్న 'హిట్ -3' (Hit -3) మూవీ ప్రచారంపై నాని దృష్టి పెట్టాడు. ఇందులో భాగంగా ఈ నెల 24న 'ప్రేమ వెల్లువ' అనే పాటను రిలీజ్ చేస్తున్నారు. దీనికి మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) స్వరాలు సమకూర్చాడు.
Also Read: Naga chaitanya 24: సైలెంట్‌గా మొదలెట్టేశాడు...
అయితే... ఈ సినిమా ప్రమోషన్స్ ను కాస్తంత భిన్నంగా ప్లాన్ చేస్తున్నాడు నాని. దానికి సంబంధించి ఓ ఇన్ స్టా రీల్ ను రిలీజ్ చేశారు. ఈ వీడియో రీల్స్ కు వ్యతిరేకంగా ఉండటం విశేషం. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలోని పాటలోని ఓ హుక్ స్టెప్ ను దర్శకుడు శైలేష్ కొలను రిలీజ్ చేయాలని భావిస్తుంటాడు. దానికి తగ్గట్టుగా కోరియోగ్రాఫర్స్ తో స్టెప్పులేయిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడకు వచ్చిన నాని... సీరియస్ సబ్జెక్ట్ తో సినిమాను తీసి... రీల్స్ చేయడం కరెక్ట్ కాదని దర్శకుడికి చెబుతాడు. అంతేకాదు... మీకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేదా... ముందు అది చూసుకోండి అంటూ కాస్తంత యాటిట్యూడ్ నూ ప్రదర్శిస్తాడు. దాంతో మౌనంగా శైలేష్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతని వెనకే హీరోయిన్ శ్రీనిధి శెట్టి (Srinidhi Setty) కూడా వెళ్ళిపోతుంటే... ఆమె చేయి పట్టుకుని, రీల్స్ వద్దన్నాను.. తప్పితే రొమాన్స్ ను కాదు అంటూ నవ్వుతూ చెబుతాడు నాని. సో... యాక్షన్ డ్రామా 'హిట్ -3'లో రొమాన్స్ కూ తగినంత స్పేస్ ఉందని హీరో కమ్ ప్రొడ్యూసర్ నాని చెప్పకనే చెప్పాడు. మరి 24న రాబోతున్న 'ప్రేమ వెల్లువ...' సాంగ్ లో ఈ జోడీ ఏ స్థాయిలో రొమాన్స్ పండించిందో చూడాలి.
Also Read: Kamal Haasan: థగ్ లైఫ్ మ్యూజిక్ జర్నీ మొదలైంది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి