Nithiin: పవన్‌, ప్రభాస్‌ నుంచి దొంగిలించేవి అవే...

ABN , Publish Date - Mar 16 , 2025 | 01:40 PM

శనివారం భీమవరంలో జరిగిన రాబిన్‌హుడ్‌ ఈవెంట్‌లో నితిన్‌ టాలీవుడ్‌ అగ్ర హీరోల గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. పలువురు హీరోల నుంచి కొన్ని దొంగిలించాలనుకున్నానని ఆయన చెప్పారు.


శనివారం భీమవరంలో జరిగిన రాబిన్‌హుడ్‌ (Robinhood) ఈవెంట్‌లో నితిన్‌ (Nithiin) టాలీవుడ్‌ అగ్ర హీరోల గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. పలువురు హీరోల నుంచి కొన్ని దొంగిలించాలనుకున్నానని ఆయన చెప్పారు. యాంకర్‌ ఆయన్ని పలు సరదా ప్రశ్నలు అడిగారు. తెలుగు సినిమా హీరోల ఫొటోలను చూపిస్తూ అవకాశం వస్తే వారి నుంచి ఏ విషయాన్ని దొంగిలించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందించారు.

‘‘నాని(Nani) నుంచి ‘ఈగ’ (Eega) చిత్రాన్ని. అది కాకుండా, ఆయన స్క్రిప్ట్ 
సెలక్షన్‌ చాలా బాగుంటుంది. ఆ క్వాలిటీని దొంగిలించాలి. ఎన్టీఆర్‌ నుంచి డైలాగ్‌ డెలివరీ, మహేశ్‌బాబు నుంచి అందం, స్వాగ్‌, పవన్‌ కల్యాణ్‌ నుంచి అన్ని విషయాలు, ప్రభాస్‌ నుంచి వ్యక్తిత్వం, రాజసం, విజయ్‌ దేవరకొండ రౌడీ క్యారెక్టర్‌.. తీసుకోవాలని ఉంది’’ అని అన్నారు. ఇదే ప్రశ్నను శ్రీ లీలను అడగగా.. కాజల్‌ నుంచి కళ్లు, అనుష్క నుంచి ఎత్తు, వ్యక్తిత్వం తీసుకోవాలనుకుంటున్నానని చెప్పారు. హెయిస్ట్‌ కామెడీ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రచార చిత్రాలను చూేస్త ఇందులో నితిన్‌ దొంగగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. మార్చి 28న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Updated Date - Mar 16 , 2025 | 01:41 PM