Committee Kurrollu: నిహారిక కొణిదెల రెండో సినిమా....

ABN , Publish Date - Mar 19 , 2025 | 05:31 PM

నటనతో పాటు చిత్ర నిర్మాణానికి నిహారిక కొణిదెల ప్రాధాన్యం ఇస్తోంది. 'కమిటీ కుర్రోళ్ళు' తర్వాత వెబ్ సీరిస్ నిర్మించిన నిహారిక త్వరలో రెండో సినిమాకు శ్రీకారం చుట్టబోతోంది.

ఎవరికైనా విజయం గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఆ విజయానికి పొంగిపోకుండా మరింత క్రమశిక్షణతో, నిబద్ధతతో ముందుకు సాగాల్సి ఉంటుంది. విజయం ఇచ్చిన ఊపుతో తడబడకుండా ఆచితూచి అడుగులు వేయాలి. నాగబాబు (Nagababu) కుమార్తె నిహారిక కొణిదెల (Nihaarika Konidela) కూడా ఇప్పుడు అదే పనిచేస్తోంది. గత యేడాది ఆమె నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' (Committee Kurrollu) చిత్రం చక్కని విజయాన్ని అందుకుంది. అంతేకాదు... చిన్న చిత్రాల నిర్మాతలలో కొత్త ఆశలు రేపింది. ఆ వెనుకే వచ్చిన 'ఆయ్' (Aye) చిత్రమూ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ బాటలో మరిన్ని చిన్న చిత్రాలు జనం ముందుకు వచ్చాయి.


'కమిటీ కుర్రోళ్ళు' విజయం ఇచ్చిన స్ఫూర్తితో నిహారిక కొణిదల మరో సినిమాకు త్వరలోనే శ్రీకారం చుట్టబోతోంది. ఈ సినిమా ద్వారా ఆమె మానస శర్మ (Manasa Sharma) ను వెండితెరకు పరిచయం చేయనుంది. ఇప్పటికే మనస శర్మ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లోనే 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సీరిస్ ను డైరెక్ట్ చేసింది. ఇది జీ 5లో స్ట్రీమింగ్ అయ్యింది. అలానే మానస శర్మ రూపొందించిన 'బెంచ్ లైఫ్‌' వెబ్ సీరిస్ సోలీ లివ్ లో వచ్చింది. ఈ రెండు కూడా మేకర్ గా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. దాంతో మానస శర్మతోనే నిహారిక కొణిదల తన రెండో సినిమాను నిర్మించబోతోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో 3వ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియచేయనున్నారు.

Also Read: Trinadha Rao Nakkina: చౌర్య పాఠం నుండి ఆడ పిశాచం సాంగ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 19 , 2025 | 05:32 PM