Nidhhi Agerwal: రాజాసాబ్.. ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారు..
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:28 AM
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇద్దరు అగ్ర హీరోల సరసన నిధీ నటిస్తోంది. పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’లో, ప్రభాస్‌తో ‘రాజాసాబ్’లోను నటిస్తున్నారు. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాల కోసం ప్రేక్షకులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు
'సవ్యసాచి' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు నిధీ అగర్వాల్(Nidhhi Agerwal). వరుసగా అవకాశాలు అందుకొంది కానీ ఇస్మార్ శంకర్’ మినహా మరే చిత్రం ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. సక్సెస్ లేకపోయినా అవకాశాలు అందుతూనే ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇద్దరు అగ్ర హీరోల సరసన నిధీ నటిస్తోంది. పవన్ సరసన ‘హరిహర వీరమల్లు’లో(HariHara Veeramallu) , ప్రభాస్‌తో ‘రాజాసాబ్’(RajaSaab)లోను నటిస్తున్నారు. ఈ రెండు పాన్ ఇండియా చిత్రాల కోసం ప్రేక్షకులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిధీ మాట్లాడుతూ
‘‘ప్రేక్షకులు ఎక్కువగా నా నుంచి గ్లామర్ పాత్రలు ఆశిస్తారు. నేను కూడా అలాంటి పాత్రలే ఎక్కువగా చేస్తానని అనుకుంటారు. రాజాసాబ్‌తో ప్రజలు నాపై ఉన్న ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకుంటారని కచ్చితంగా చెప్పగలను.ఇందులో నా పాత్ర రెగ్యులర్ హాట్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇందులో నా పాత్రను సినీ ప్రియులు, అభిమానులు ఏమాత్రం ఊహించలేరు’’ అని అన్నారు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్ మొదటిసారి హారర్ నేపథ్యంలో ఉన్న కథలో నటిస్తుండటంతో అందరి దృష్టి ఈ చిత్రంపైనే ఉంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్థికుమార్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రం రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘‘ఇది చాలా మాస్ ఆల్బమ్. చాలా రోజుల తర్వాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్, డ్యూయెట్, ఐటెం సాంగ్, ముగ్గురు అమ్మాయిలతో ఒక పాట.. ఇలా చాలా రకాల సాంగ్స్ ఉన్నాయి. మంచి ఫాంటసీ చిత్రమిది. ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఇందులో వింటేజ్ ప్రభాస్‌ను చూస్తారు’’ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ చెప్పారు.