Santosh: మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా వస్తున్న ఆర్టిస్ట్....

ABN , Publish Date - Mar 05 , 2025 | 01:19 PM

సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న 'ఆర్టిస్ట్' మూవీని రతన్ రిషి డైరెక్ట్ చేశారు. జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న మైత్రీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా తెలుగువారి ముందుకు రాబోతోంది.

సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా 'ఆర్టిస్ట్' (Artiste). రతన్ రిషి దర్శకత్వంలో జేమ్స్ వాట్ కొమ్ము (James Watkommu) నిర్మిస్తున్న ఈ సినిమా ఇదే నెల 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా గీత రచయిత రాంబాబు గోసాల (Rambabu Gosala) మాట్లాడుతూ, ఈ సినిమా కోసం సురేశ్ బొబ్బిలి (Suresh Bobbili) స్వరపర్చిన అన్ని పాటలకూ తానే సాహిత్యం అందించానని తెలిపారు. ఇప్పటికే ఇందులో రెండు పాటలు విడుదలయ్యాయని వాటిని రతన్ రిషి చక్కగా తెరకెక్కించారని హర్షం వ్యక్తం చేశారు.

ట్రైలర్ లాంచ్ అనంతరం హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ, 'సొసైటీలోని ఓ సమస్యను ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారని, సమస్య పాతదే అయినా... కథనం ఆకట్టుకునేలా ఉంటుంద'ని అన్నారు. సీనియర్ నటులు తనికెళ్ళ భరణి, వినయ్ వర్మ లాంటి వారితో నటించడం ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం పట్ల క్రిషేక పటేల్ హర్షం వ్యక్తం చేసింది. కొత్తవాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో తాను సినిమాలు నిర్మిస్తున్నానని ఎన్.ఆర్.ఐ. జేమ్స్ వాట్ కొమ్ము తెలిపారు. తన బ్యానర్ నుండి వస్తున్న రెండో సినిమా ఇదని, మూవీ నచ్చి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పంపిణీకి చేయడానికి ముందుకొచ్చిందని అన్నారు.

'ఆర్టిస్ట్' మూవీ కథ గురించి దర్శకుడు రతన్ రిషి (Ratan Rishi) చెబుతూ, 'ఇదో సైకో థ్రిల్లర్ మూవీ. సస్పెన్స్, టెర్రర్, కామెడీ, రొమాన్స్... ఇలా అనేక అంశాలు ఇందులో ఉంటాయి. కథ ఓ ఎమోషన్ తో సాగుతుంది. చివరి 20 నిమిషాలు హై ఉంటుంది. చివరకు ఓ గుడ్ ఫీల్ తో ఆడియెన్స్ థియేటర్ నుండి బయటకు వస్తారు. ఈ కథకు తగ్గట్టుగా సురేశ్ బొబ్బొలి చక్కని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో నటి స్నేహ మాధురిశర్మ, నటుడు వెంకీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బసంత్, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, తాగుబోతు రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

a.jpg

Also Read: Telugu Cinema: అప్పట్లో 200కు పైగా సెంటర్స్... ఇప్పుడంత సీన్ లేదు....

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 05 , 2025 | 01:19 PM