Mowgli 2025: బర్త్ డే సందర్భంగా రోషన్ కనకాల పోస్టర్

ABN , Publish Date - Mar 15 , 2025 | 01:21 PM

రాజీవ్, సుమ కనకాల తనయుడు రోషన్ ఇప్పుడు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని పుట్టినరోజు సందర్భంగా 'మోగ్లీ 2025' మూవీ నయా పోస్టర్ రిలీజ్ అయ్యింది.

ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala), స్టార్ యాంకర్ సుమ (Suma) కనకాల తనయుడు రోషన్ (Roshan) ఇప్పుడు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 'నిర్మలా కాన్వెంట్' ద్వారా టీనేజ్ లోనే చిత్రసీమలోకి అడుగుపెట్టిన రోషన్ కనకాల, కొంతకాలం క్రితం 'బబుల్ గమ్' (Babbulgum) మూవీ హీరోగా నటించాడు. నటుడిగా రోషన్ కు గుర్తింపు లభించింది కానీ ఆ సినిమా కమర్షియల్ హిట్ కాలేదు. దాంతో ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.


Mowgli-plain.jpg

ప్రస్తుతం రోషన్ హీరోగా 'కలర్ ఫోటో' (Color Photo) ఫేమ్ సందీప్ రాజ్ 'మోగ్లీ 2025' (Mowgli 2025) పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీనిని టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఇంటెన్స్ సీన్స్ ను రంపచోడవరం, మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాలో రెండు భారీ సెట్స్ వేసి పిక్చరైజ్ చేశారు. సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి కాలభైరవ (Kaala bhairava) సంగీతం అందిస్తున్నాడు. మార్చి 15న రోషన్ కనకాల పుట్టిన రోజు సందర్భంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బర్త్ డే స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది.

Also Read: Sanvi Sudeep: డాడీ ప్లేస్ భర్తీ చేయబోతున్న స్టార్ డాటర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 15 , 2025 | 01:21 PM