Netflix under Pushpa’s Rule: పుష్ప గాడి రూల్‌లో నెట్‌ఫ్లిక్స్..

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:00 PM

Netflix under Pushpa’s Rule: దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ పుష్ప రాజ్‌కు గులాం అయ్యింది. తాజాగా ఆ సంస్థ తన అన్ని సోషల్ మీడియా వేదికలుగా ఈ విషయాన్నీ ప్రకటించింది.

Netflix under Pushpa’s Rule

గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ఎన్ని రికార్డులను బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సంక్రాంతికి మరిన్ని పెద్ద సినిమాలు రిలీజ్ కానుండటంతో పుష్ప రాజ్ రూల్ కాస్త స్లో అయినట్లు కనిపించిన జనవరి 17న రిలీజైన రీ లోడెడ్ వెర్షన్ కి భారీ స్పందన లభించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో ఎక్స్‌టెండెడ్ వెర్షన్ తో రిలీజ్ అయ్యింది. దీనికి వీక్షకులు ఏమో కానీ.. నెట్‌ఫ్లిక్స్ మాత్రం దాసోహం అయినట్లు ప్రకటించింది. ఇంతకీ ఏం జరిగిందంటే ..


'పుష్ప 2' రన్ టైమ్ 3 గంటల 17 నిమిషాలు. రీలోడెడ్ వెర్షన్ లో మరో 10 నిమిషాల యాడ్ చేయగా ఎక్స్‌టెండెడ్ వెర్షన్ లో మరో 20 నిమిషాల అదనపు ఫుటేజ్ ని యాడ్ చేశారు. అంటే మొత్తం 3 గంటల 47 నిమిషాల మూవీని నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్ ల బయోలను ఛేంజ్ చేసింది. 'దిస్ పేజ్ అండర్ పుష్ప రూల్'( ఈ పేజీ పుష్ప గాడి రూల్‌లో ఉంది) అంటూ రాసుకొచ్చింది. ఇప్పడు ఇది సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దీంతో పుష్ప రాజ్ ప్రభావం దేశవ్యాప్తంగా ఎలా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

NETFLIX.jpg


అలాగే.. నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రత్యేక వీడియోని కూడా రిలీజ్ చేసింది. ఇందులో పుష్ప రాజ్ ఎర్ర చందనం దుంగలను లోడ్ చేస్తుంటాడు. ఇంతా పెద్ద లోడ్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగితే పుష్ప రాజ్ తన స్టైల్ లో నెట్‌ఫ్లిక్స్ పేరును చూపిస్తాడు. అనంతరం " నెట్‌ఫ్లిక్స్ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్" అనే డైలాగ్ తో పాటు నెట్‌ఫ్లిక్స్ జింగిల్ 'టుడుమ్' అని బన్నీ చెప్పడం హైలెట్ గా నిలిచింది. కాగా, ఈ సినిమా హిందీ వెర్షన్ పై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు.

Updated Date - Jan 31 , 2025 | 03:08 PM