Nara Lokesh: 'డాకు మహారాజ్' చూస్తూ నారా లోకేష్ ఏం చేశాడంటే..
ABN , Publish Date - Jan 13 , 2025 | 05:47 PM
Nara Lokesh: సంక్రాంతి సంబరాలు స్టార్ట్ కావడంతో జనాలు అందరు పట్టణాలు వదిలి పల్లెలు వెళ్ళినట్లే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన సొంతూరు నారావారి పల్లి చేరుకున్నారు. మరోవైపు ఆయన కుమారుడు నారా లోకేష్ చంద్రగిరికి చేరుకున్నాడు
ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్' ఊచకోత మాములుగా లేదు. బాలయ్య, బాబీ ట్రాక్ అదిరిపోవడంతో హిట్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ సినిమా వైపు మొగ్గు చూపుతున్నారు. మరి బాలయ్య కుటుంబం మాత్రం ఎందుకు ఖాళీగా ఉంటారు. బాలయ్య కూతుళ్లు, అల్లుళ్ళు ఏం చేశారంటే..
సంక్రాంతి సంబరాలు స్టార్ట్ కావడంతో జనాలు అందరు పట్టణాలు వదిలి పల్లెలు వెళ్ళినట్లే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన సొంతూరు నారావారి పల్లి చేరుకున్నారు. మరోవైపు ఆయన కుమారుడు నారా లోకేష్ చంద్రగిరికి చేరుకున్నాడు. దీంతో నారావారి పల్లి, చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో సంబరాలు అంబరాన్ని చేరుతున్నాయి. లోకేష్ తో పాటు ఆయన భార్య, బాలకృష్ణ కూమార్తె బ్రాహ్మణి, బ్రాహ్మణి సోదరి తేజస్విని, తన భర్త, విశాఖ ఎంపీ భరత్ ఉన్నారు. వీరంతా కలిసి థియేటర్ కు వెళ్లి బాలయ్య 'డాకు మహారాజ్' సినిమా వీక్షించారు. వీరితో పాటు బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ, దగ్గరి బంధువులు చాలా మందే కనిపించరు. కాగా, బాయ్స్ గ్యాంగ్ అంతా ఒక వరుసలో, లేడీస్ అంతా ఇంకో వరుసలో కూర్చోవడంతో.. వీళ్ళు కూడా మనలాగే అంటూ మిడిల్ క్లాస్ పీపుల్ రిలేట్ అవుతున్నారు.
మరోవైపు ఈ చిత్రం తొలిరోజు రూ.56 కోట్లు వసూలు చేసినట్లు టీమ్ (First Day collections) అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళు సాధించిన చిత్రాల లిస్ట్‌లో ఈ చిత్రం చేరింది. సినిమా ప్రకటించినప్పటి నుంచీ దర్శకుడు ఎంతో ధీమాగా ఉన్నారు. నమ్మకం వమ్ముకాకుండా సక్సెస్ అయినందుకు ఆయన ఆనందం రెట్టింపు అయింది. ఓవర్సీస్‌లో టికెట్స్ ఓపెన్ చేసిన నాటినుంచి బుకింగ్స్‌లో హవా చాటిన ‘డాకు మహారాజ్’ తొలిరోజు వన్ మిలియన్ క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకుంది. దీంతో సంక్రాంతి విన్నర్ బాలయ్య అంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు