Nara Bhuvaneshwari: బాలయ్యకు సోదరి స్పెషల్ పార్టీ..
ABN , Publish Date - Jan 31 , 2025 | 06:31 PM
Nara Bhuvaneshwari: బాలయ్యకు ఆయన సోదరి భువనేశ్వరికి మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి బాలయ్యకు దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారం వరించినప్పుడు తన సోదరి ఎలా రియాక్ట్ అయ్యిందో తెలుసా!
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాలలో నందమూరి నటసింహం బాలయ్యకు ‘పద్మ భూషణ్’ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, ఇండస్ట్రీ పర్సన్స్, ఆయన నియోజక వర్గ ప్రజలు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోదరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. బాలయ్య పెద్ద పార్టీ ఇచ్చేందుకు రెడీ అయ్యిందట. ఎప్పుడు? ఎక్కడంటే..
సోదరుడు నందమూరి బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డు రావడంపై సోదరి భువనేశ్వరి తెగ సంబరపడిపోతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆమె శనివారం హైదరాబాద్ శివారులోని చంద్రబాబు నాయుడు ఫామ్ హౌస్ లో పెద్ద పార్టీ ఇవ్వనున్నారు. ఈ పార్టీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు నందమూరి, నారా కుటుంబ సన్నిహితులు, బంధువులు హాజరు కానున్నారు. అలాగే ఇండస్ట్రీకి చెందిన కొందరు దర్శక, నిర్మాతలకు కూడా ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.
మరోవైపు చిత్ర పరిశ్రమ నుండి కూడా బాలయ్యను సత్కరించనున్నారు. గతంలో ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి వంటి నటులు అత్యున్నత పురస్కారాలు అందుకున్న నేపథ్యంలో ఇండస్ట్రీ అంతా కలిసి సత్కరించింది. ఇప్పుడు బాలయ్య అత్యున్నత పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఇండస్ట్రీ తరపున ఎవరు ముందుకు వచ్చి ఈ ప్రోగ్రామ్ ను అరేంజ్ చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది.