Court: రిలీజ్‌కి ముందే ప్రాఫిట్‌..  ఇదీ నాని లెక్క

ABN , Publish Date - Feb 22 , 2025 | 11:27 AM

ప్రస్తుతం తన బ్యానర్‌లో చిన్న సినిమాల్ని మంచి ప్లానింగ్‌తో తీస్తున్నాడు నాని. వాటి ప్రమోషన్‌ కూడా ఇన్నోవేటివ్‌గా చేస్తుంటాడు. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘కోర్ట్‌’ (Court). ప్రియదర్శి కథానాయకుడిగా నటించిన సినిమా ఇది.


సినీ నేపథ్యంలో లేకుండా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్‌ అయిన వారిలో నేచురల్‌ స్టార్‌ నాని ఒకరు (Natural Star Nani).  అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి హీరోగా ఎదిగాడు. హీరోగా సూపర్‌ సక్సెస్‌. ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్లున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ వాల్‌ పోస్టర్‌ బ్యానర్‌ నుంచి వచ్చిన ఏ సినిమా ఆడియన్స్‌ని నిరుత్సాహపరచలేదు. ప్రస్తుతం తన బ్యానర్‌లో చిన్న సినిమాల్ని (Small budget movies) మంచి ప్లానింగ్‌తో తీస్తున్నాడు. వాటి ప్రమోషన్‌ కూడా ఇన్నోవేటివ్‌గా చేస్తుంటాడు. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘కోర్ట్‌’ (Court). ప్రియదర్శి కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. మార్చి 14న విడుదలవుతోంది. ఫస్ట్‌ కాపీ రెడీ అయ్యింది. మార్చి 14న విడుదలకు సిద్ధమైంది. అంటే ఇంకో మూడు వారాల సమయం ఉంది. కానీ నాని ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు.  ఇప్పటికే ఓటీటీ బిజినెస్‌ క్లోజ్‌ (Ott business) అయింది. దాదాపు రూ.9 కోట్లకు నెట్‌ఫిక్స్‌ సంస్థ ఈ సినిమాని కొనుగోలు చేసిందని తెలిసింది. సినిమాకు  ప్రియదర్శి రెమ్యునరేషన్‌ రూ.2 కోట్లు. మిగిలిన రెమ్యునరేషన్స్‌, మేకింగ్‌ కోసం రూ.4 కోట్లు వేసుకున్నా.. రూ.6 కోట్లలో సినిమా పూర్తవుతుంది. మరో రూ.3 కోట్లు ప్రాఫిట్‌. ఇది ఓటీటీ లెక్క మాత్రమే.. ఇంకా శాటిలైట్‌ బిజినెస్‌ క్లోజ్‌ కాలేదు. ఇక థియేటర్‌ నుంచి వచ్చిందంతా బోనస్‌ అనుకోవాలి.

చిన్న సినిమా, విడుదలకు ముందే లాభాలు, రిలీజ్‌ అయ్యాక పేరొస్తే ఆ లెక్కే వేరు. ఏది ఏమైనా ఈ ప్లానింగ్‌ వెనక నాని ఉన్నారు. దీని క్రెడిట్‌ మొత్తం నానికే చెందుతుంది. యంగ్‌ హీరోలంతా ఇలా ప్లానింగ్‌తో సినిమాలు తీసుకొంటే.. న్యూ ఏజ్‌ కథలు, న్యూ టాలెంట్‌ చాలామంది ఇండస్ట్రీకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సినిమాకు నాని భారీగా ప్రీమియర్లు ప్లాన్‌ చేశారట. దాని నుంచి కూడా సినిమాకు క్రేజ్‌ పెంచే ప్లాన్‌లో ఉన్నాడు. ప్రియదర్శికి (Priyadarshi) కూడా ‘బలగం’ లాంటి హిట్‌ చేతిలో ఉంది. కాబట్టి ఈ సినిమాకు మంచి టాక్‌ వస్తే లాభాల బాటే. 

Updated Date - Feb 22 , 2025 | 11:46 AM