Nandamuri TarakaRanta: తారకరత్న రెండో వర్ధంతి.. భార్య ఎమోషనల్ పోస్ట్
ABN , Publish Date - Feb 18 , 2025 | 01:04 PM
నటుడు నందమూరి తారకరత్న మరణించి రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన భార్య అలేఖ్య భావోద్వేగానికి లోనయ్యారు. భర్త జ్ఞాపకాలను తలచుకుంటూ పోస్ట్ పెట్టారు.
నటుడు నందమూరి తారకరత్న (TarakaRatna) మరణించి రెండేళ్లు పూర్తయింది. 2023 జనవరి 27న యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గుండెపోటు రావడంతో ఆయన్ను తొలుత కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ రెండు వారాలకు పైగా మృత్యువుతో పోరాడుతూ ఫిబ్రవరి 18న మృతి చెందారు. ఆయన ఆయన వర్ధంది. ఈ సందర్భంగా ఆయన భార్య అలేఖ్య (Alekhya Emotional Post) భావోద్వేగానికి లోనయ్యారు. భర్త జ్ఞాపకాలను తలచుకుంటూ పోస్ట్ పెట్టారు. (TarakaRatna Death Ceremony)
"విధి వక్రించి నిన్ను మాకు దూరం చేసింది. నువ్వు లేని లోటును ఈ లోకంలో ఏదీ పూరించదు. నిన్ను కోల్పోయిన బాధ, మనసుకి తగిలిన గాయం ఎప్పటికీ తగ్గదు. మనం ఇలా దూరం అవుతాయని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు ఇక్కడ మాతో లేకపోవచ్చు కానీ ప్రజెన్స్ మాతో అలాగే ఉంది. నువ్వు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, కలల,మా చుట్టూనే తిరుగుతున్నాయి. నీ మీద ఎప్పటికీ తగ్గని ప్రేమతో, మాటలకు మించి, కాలాన్ని దాటి, జీవితానికి మించి మిమ్మల్ని మిస్ అవుతున్నాం’’ అని అలేఖ్య భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
అలాగే తారకరత్న రెండో వర్ధంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ట్వీట్ చేశారు. "మీరు మా నుంచి దూరం అయినా మీ జ్ఞాపకాలు మా మనసులో పదిలంగా ఉన్నాయి. మీరు మా మీద చూపించిన ప్రేమ, అనురాగం శాశ్వతంగా నిలిచి ఉంటాయి. భౌతికంగా మా మధ్య లేకపోయినా మీ జ్ఞాపకాలు చిరస్మరణీయం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా బావ నందమూరి తారకరత్న రెండో వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను ’’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.