Akhanda 2: ఇది అఖండ కాదు మహాఖండ..

ABN , Publish Date - Jan 14 , 2025 | 07:32 AM

Akhanda 2: ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఇంట్రో వీడియో, పోస్టర్ అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. తాజాగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఏంటంటే..

Akhanda 2

‘సింహ, లెజెండ్, అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాల తర్వాత నాల్గవసారి నందమూరి బాలకృష్ణ, బోయపాటి చేయనున్న మూవీ ‘అఖండ 2’. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ సినిమాకి ఇది సీక్వెల్‌గా రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ఇంట్రో వీడియో, పోస్టర్ అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. తాజాగా ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఏంటంటే..


ఇప్పటికే ఈ సినిమాని దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను 'మహాకుంభమేళా'లో చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ అఫీషియల్ గా తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. దీంతో అభిమానుల్లో బజ్ మరింత పెరిగింది. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సి రాంప్రసాద్, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్‌ లతో పాటు అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.


మరోవైపు బాలకృష్ణ హీరోగా సంక్రాంతి బరిలో విడుదలై చక్కని విజయాన్ని అందుకొంది ‘డాకు మహారాజ్‌’. దీంతో చిత్రబృందంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సినిమా బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళు సాధించిన చిత్రాల లిస్ట్‌లో ఈ చిత్రం చేరింది.

Also Read- Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తునాం 'ట్విట్టర్' రివ్యూ


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 14 , 2025 | 07:36 AM